జ‌న‌సేన వైసీపీ... సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా మారిన పోరులో విన్న‌ర్ ఎవ‌రో ?

RAMAKRISHNA S.S.
- రాజాన‌గ‌రంలో జ‌న‌సేన బ‌త్తుల.. వైసీపీ రాజా హోరా హోరీ
- న‌రాలు తెగే పోరులో శృతిమించిన వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు
- వైసీపీ ఎంపీటీసీ నుంచి రాజాపై పోటీ వ‌ర‌కు ఎదిగిన బ‌త్తుల‌
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
ఉభయగోదావరి జిల్లాలలోని ఇద్దరు కాపు సామాజిక వర్గ నేతల మధ్య అత్యంత ఆసక్తి రేపుతున్న పోరుకు రాజానగరం నియోజకవర్గ వేదికగా మారింది. ఇక్కడ నుంచి జనసేన తరఫున బలరామకృష్ణ, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య రోజురోజుకు ఆధిక్యం చేతులు మారుతూ వస్తోంది. కచ్చితంగా ఎవరు గెలుస్తారు ? అన్నది చెప్పలేని పరిస్థితి. అయితే టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బొడ్డు వెంకటరమణ చౌదరి జనసేన అభ్యర్థి బలరామకృష్ణకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. దీనికి తోడు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ క్యాడర్ తో పాటు సీతానగరం మండలంలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రముఖ టీడీపీ నేతలు అందరూ కలిసికట్టుగా జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు.

వైసీపీని ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో టీడీపీకి చెందిన అందరి నేతలు అన్ని వర్గాలు ఒక్క‌టైన పరిస్థితి నెలకొంది. ఇక పొత్తులో భాగంగా జనసేన నుంచి పోటీ చేస్తున్న బ‌త్తుల‌ బలరామకృష్ణ గతంలో వైసీపీ నుంచి ఎంపీటీసీగా గెలిచి జక్కంపూడి రాజా తో విభేదించి రాజానగరం జనసేన అభ్యర్థిగా అదే రాజాపై పోటీలో ఉన్నారు. వైసీపీలో జక్కంపూడి దగ్గర ఎంపీటీసీగా ఉండి బయటకు వచ్చిన బలరామకృష్ణ జనసేన లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ తనకు గట్టి పోటీ దారిగా మారతాడని జక్కంపూడి రాజా అసలు ఊహించలేదు. బలరామకృష్ణ నియోజకవర్గంలో ఏడాది నుంచి క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసుకుంటూ వస్తూ పవన్ కళ్యాణ్‌ను మెప్పించారు.

రాజానగరం సీటు కచ్చితంగా జనసేన పోటీ చేస్తుందన్న ప్రచారం గట్టిగా వినిపించింది. తీరా ఇప్పుడు ఎన్నికల వేళ‌ చూస్తుంటే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. రాజానగరంలో ఎవరు గెలుస్తారు అన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రోజురోజుకు ఆధిక్యం చేతులు మారుతుంది. మరి ఈ ఉత్కంఠ పోరులో జనసేన కాపు నేత‌ గెలుస్తాడా ? లేదా వైసీపీ కాపు నేత రాజా గెలుస్తాడా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: