ఏపీలో మైనార్టీలు సీమ‌లో అలా.. అమ‌రావ‌తిలో ఇలా ఓట్లేశారా ?

RAMAKRISHNA S.S.
- బీజేపీతో పొత్తుతో కూట‌మికి దూర‌మైన మైనార్టీలు
- సీమ‌, నెల్లూరు మైనార్టీలు ఏక‌ప‌క్షంగా వైసీపీకే
- విజ‌య‌వాడ‌, గుంటూరులో కూటిమి క్యాండెట్ల‌కూ కొన్ని ఓట్లు
( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )
ఒక్కొక్క సామాజిక వ‌ర్గం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ విష‌యంలో సందేహం లేదు. కొన్ని జిల్లాల ను ఒక సామాజిక వ‌ర్గం ప్ర‌బావితం చేస్తే.. మ‌రికొన్ని జిల్లాల‌ను ఇంకొన్ని సామాజిక వ‌ర్గాలు ప్ర‌భావితం చేస్తున్నాయి. ఇలాంటి స‌మీక‌ర‌ణ‌లు చూస్తే... నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు.. మొత్తంగా మైనారిటీ వ‌ర్గాల వైపు ఉన్నాయి. అదేవిధంగా క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల్లోనూ ఇలానే ప్ర‌భావితం చేస్తున్నారు. ఇప్పుడు ఆయాజిల్లాల్లో జ‌రిగిన పోలింగ్‌ను ప‌రిశీలిస్తే.. ఎవ‌రు ఎటువైపు మొగ్గార‌నేది ఆస‌క్తిగా మారింది.

నెల్లూరు జిల్లాలో అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత కూడా.. పోలింగ్ న‌మోదైంది. ఇక్క‌డ మైనారిటీ ముస్లిం మ‌హిళ ల గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువే. వీరంతా కూడా బారులు తీరి క‌నిపించారు. రాత్రి ప‌ది త‌ర్వాత‌.. కూడా మ‌హిళ‌లు బూతుల్లో ఉన్నారు. దీంతో ఇక్క‌డ ఎవ‌రికి మొగ్గు చూపార‌నేది ఆస‌క్తిగా మారింది. అదే విధంగా క‌ర్నూలు, క‌డ‌ప‌ల్లోనూ మైనారిటీల ఓట్లు ఎక్కువ‌గా ప‌డ్డాయి. పైగా.. గ‌త ఎన్నిక‌లకు మించి ఇక్క‌డ పోలింగ్ న‌మోదైంది.

దీంతో ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు వైసీపీకి ఎక్కువ‌గా మొగ్గు చూపించార‌ని అంటున్నారు ప‌రిశీ ల‌కులు. నిజానికి ఆయా జిల్లాల్లో టీడీపీకి కూడా మైనారిటీ ఓటు బ్యాంకు ఉంది. నంద్యాల వంటి చోట్ల మైనారిటీల‌కే చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. దీంతో అక్క‌డ జ‌రిగిన పోలింగ్‌ను ప‌రిశీలిస్తే.. టీడీపీకి అనుకూల‌మ‌నే అవ‌కాశం ఉంటుంది. గ‌తంలోనూ టీడీపీకి సానుకూలంగా మైనారిటీ ఓట‌ర్లు పోటెత్తిన సంద‌ర్భాలు ఉన్నాయి. దీంతో ఈ మేర‌కు విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

కానీ, చంద్ర‌బాబు బీజేపీ కోసం వేచి ఉండ‌డం.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం.. మ‌రోవైపు బీజేపీ మైనారిటీ ల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డం.. వంటివి కొంత మేర‌కు మైనారిటీల‌ను టీడీపీకి దూరంగా ఉంచా యి. ఆ పార్టీకి సానుకూల‌త లేద‌ని కాదు. కానీ, ఉన్న‌ప్పటికీ.. బీజేపీ ఫ్యాక్ట‌ర్ అయితే.. మైనారిటీల‌పై ప్ర‌భావం చూపింది. దీంతో మైనారిటీ ఓటు బ్యాంకు టీడీపీకి దూర‌మైంది. ఇక్క‌డ మొత్తంగా గుండుగుత్త‌గా వైసీపీకి ప‌డుతుంద‌ని కూడా చెప్ప‌లేం. కాంగ్రెస్‌కు వేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: