2024 ఎలక్షన్: వారే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను డిసైడ్ చేస్తున్నారా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని గత నెల 13వ తేదీన ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది. ఫలితాలు ఈనెల నాలుగవ తేదీన రాబోతున్నాయి.. అయితే ముఖ్యంగా ఓటింగ్ ప్రక్రియలో రెడ్లు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ఓట్లన్నీ కూడా వైసిపి పార్టీకి మెజారిటీ 90 శాతం వరకు వైసిపి పార్టీకి పడ్డాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కమ్మ, కాపు ,బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు టిడిపి పార్టీకి 80 శాతం వరకు ఓటు వేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యలో బీసీ సామాజిక వర్గం ఎటువైపుగా ఓటు వేశారన్నది ఇప్పుడు కీలకంగా మారనుంది.

ఈ ఓటర్లే ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎంని డిసైడ్ చేయబోతున్నట్లుగా పలువురు విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు. వీరు ఎవరికి వేశారనే విషయం పైన కూడా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయట. అందుకే ఈ ఎన్నికలలో బీసీ ఓట్లు చాలా కీలకంగా మారుతున్నాయి అనే విధంగా తెలియజేస్తున్నారు.అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.. ఫోల్ రిజల్ట్ చూస్తే కనుక 82% పోలింగ్ అయ్యింది.. అయితే ఏదో ఒకవైపు గెలుపు అయి ఉంటుందని మరికొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు.. అత్యాశంగా ఉండదు అనే విధంగా తెలియజేస్తున్నారు..

ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు , మాజీమంత్రి ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ నాయకుడు. ఆయన అంచనా ప్రకారం 90 నుంచి 97 సీట్లు ఏ పార్టీకైనా విజయాన్ని చేకూరుస్తాయని అంతకుమించి సీట్లు రావని కూడా తెలియజేస్తున్నారు.. ఈ సీట్లతోనే అధికారంలోకి వచ్చేందుకు ఆస్కారం ఉన్నదని తెలియజేశారు. ఈ ఎన్నికలు చాలా టఫ్ గా నడిచినాయి  ఖచ్చితంగా ఫలానా పార్టీ గెలుస్తుంది అనే విషయం చెప్పడం కష్టంగా మారింది అంటూ తెలియజేశారు. ఇప్పుడు రఘువీరా రెడ్డి చేసినటువంటి ఈ విషయం చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా ఏ పార్టీకి కూడా వందకు మించి సీట్లు రావని కూడా తెలియజేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: