ఏపీ: మరో సారీ 52% ఓటింగ్ తో వైసిపి పార్టీదే విజయఖేతం..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఓటింగ్ ఫలితాలు దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క సర్వేలు ప్రీపోల్, పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఈ రోజున విడుదలవుతాయి. అయితే ఈ రోజు ఎవరి అంచనాలు వాళ్ళవి తెలియజేస్తున్నారు. ఎవరి సంతోషాలు వాళ్ళవి. ఇదంతా నాలుగవ తేదీ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులను ఆకట్టుకునే విధంగా కొంత మంది ఇలాంటివి తెలియజేస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.

తాజాగా ఇప్పుడు కొత్తగా ఒక పేరు లైన్ లోకి వచ్చింది.. మహమ్మద్ ఖుర్షీద్ హుస్సేన్  ఎంకే హెచ్ అనే పేరుతో ఒక సర్వేని విడుదల చేశారు. సాధారణంగా ఆరా మస్తాన్ సర్వే తర్వాత.. ఆరా అనే పేరు ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ ముస్లిం సామాజిక వర్గం నుంచి ఇస్తున్న సర్వే ఇది. ఈ రంగంలోకి వాళ్లు కూడా ఎంట్రీ అవ్వడం మంచి విషయమే.. వైసీపీ పార్టీ 110 నుంచి 116 స్థానాలు వస్తాయని తెలియజేశారు. 52 శాతం ఓట్లతో గెలుస్తుందని తెలిపారు. క్రిందటి సారి 50% ఓట్లతో 151 సీట్లు గెలుచుకుంది.. కానీ ఈసారి 52% ఓటింగ్ తో 110 నుంచి 116 సీట్లు వస్తాయని తెలుపుతున్నారు.

అదే సందర్భంలో క్రిందటిసారి 40% ఓటింగ్ సంపాదించుకున్న టిడిపి పార్టీ కి జనసేన బిజెపి కలిపితే.. 47% ఓటింగ్ వస్తుందనేది వారి అంచనా గా తెలియజేస్తున్నారు. సీట్ల విషయానికి వస్తే.. 57 నుంచి 65 స్థానాలు వస్తాయని తెలియజేస్తున్నారు.. ఇది ఎంతవరకు వాస్తవమో మరి నాలుగవ తారీకు తెలుస్తుంది. ముఖ్యంగా చాలా సర్వేలు సైతం వైసిపి పార్టీ చేసిన మంచి పనుల వల్ల కచ్చితంగా ఈసారి ఆ పార్టీని అధికారంలోకి వస్తుందనే విధంగా సర్వేలు సైతం తెలియజేస్తూ ఉన్నాయి. కూటమి మాత్రం వైసిపి వ్యతిరేకత ఓటే మమ్మల్ని గెలిపిస్తుంది అని ధీమాతో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: