ఆ ఏడు అడుగులే.. బిజెపిని దెబ్బ కొట్టబోతున్నాయా?

praveen
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టాలని బిజెపి అనుకుంది. మాజీ ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ రికార్డును సమం చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే ఈసారి కేంద్రంలో ఏకంగా 400 సీట్లలో విజయం సాధించాలని భావించింది. ఈ క్రమంలోనే 543 లోక్సభ స్థానాలకు గాను ఏడు విడుదలలో సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. అయితే ఇలాంటి సుదీర్ఘ సమయమే తమకు కలిసి వస్తుందని బిజెపి అనుకుంది. ఏకంగా 21 లోక్సభ స్థానాలు ఉన్న ఒరిస్సాలోని నాలుగు విడుదల లో పోలింగ్ నిర్వహించడం గమనార్హం.

 అయితే బిజెపి అంతా అనుకున్నట్లుగానే చేసింది. కానీ తొలి  విడుద పోలింగ్  ముగిసిన తర్వాత వచ్చిన రిపోర్టు చూసి బిజెపి పెద్దలందరూ కూడా షాక్ లో పడ్డారట. ఎందుకంటే ఏడు దఫాలలో నెలపాటు వివిధ రాష్ట్రాలలో పోలింగ్ జరిగితే.. తమకు లాభం చేకూరుతుంది అనుకున్న బిజెపి పెద్దల వ్యూహాలు తారుమారు అయ్యాయట. ఒక్కో విడత పోలింగ్ మధ్య దాదాపు వారం రోజులపాటు గ్యాప్ ఉండడంతో ఇక ధరల పెరుగుదల నిరుద్యోగం వంటి సమస్యలను ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విజయం సాధించాయనే రిపోర్ట్ అటు బిజెపి పెద్దలకు అందిందట.

 దీంతో తమకు అనుకూలిస్తుంది లాభం చేకూరుస్తుంది అనుకున్నా సుదీర్ఘమైన షెడ్యూల్ చివరికి తమనే దెబ్బ కొట్టేలా ఉంది అని అనుకున్నారట మోదీ, అమిత్ షా. ఈ క్రమంలోనే సిట్టింగ్లకు సీట్లను నిరాకరించి మరి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చారు. దాదాపు 130 కి పైగా సీట్లలో కొత్త వారే ఈసారి బరిలో దిగారు. ఇక తొలి విడుద పోలింగ్ తర్వాత వచ్చిన రిపోర్టుతో ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయిన మోడీ.. ఆ తర్వాత విద్వేష ప్రసంగాలకు తెర లేపారన్న ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తల్లులు చెల్లెళ్ల మంగళసూత్రాలు వదలరు. దేశ సంపదలను చొరబాటు దారులు ముస్లింలకు పంచుతారు. వాళ్ల పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా పరిగణిస్తారు అంటూ వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు మోడీ. పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ ఇలాంటి ప్రసంగాలు చేయడం ప్రజలకు కూడా నచ్చలేదట. ఇలాంటి పరిణామాలు అన్నీ కూడా కలుపుకొని.. ఈసారి బిజెపికి షాక్ ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి 250 సీట్లు దాటడం కూడా కష్టమే అని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: