ఏపీ: ఫ్యాన్ స్పీడా... సైకిల్ జోర.. గెలుపు పై ధీమాకు కారణాలివే..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠాన్ని రేపుతున్నాయి. ఈ నెల నాలుగవ తేదీన ఫలితాలు వెలుబడుతున్న నేపథ్యంలో అధికారంలో రాబోతున్నది ఎవరనే విషయం పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే గెలుపు పైన ప్రధాన పార్టీలలో ధీమా మాత్రం కనిపిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ వైసీపీ ప్రభుత్వం చెప్పగా.. తమదే విజయం ఖాయమంటూ టిడిపి జనసేన బిజెపి కూటమిగా తెలియజేస్తున్నారు. 2014లో మ్యాజిక్ మరొకసారి రిపీట్ అవుతుందంటూ ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. మరి ఇంతకు ఆ పార్టీలకు ఉండే కాన్ఫిడెంట్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వైసీపీ పార్టీ ధీమాకు గల కారణాలు:
ముఖ్యంగా ఐదు సంవత్సరాలపాటు అమలు చేసిన నవరత్నాలు సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేశాము అర్హులందరికీ కూడా ఇచ్చామని.. వృద్ధులు వికలాంగులకు వితంతులకు ఇంటి వద్దకే పెన్షన్ పంపించడం.. ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం పాటించడం. 17 మెడికల్ కాలేజీలో నిర్మాణం నాలుగు సీపోర్టులు.. గ్రామ సచివాలయ, వాలంటరీ వ్యవస్థ. అలాగే విలేజ్లలో క్లినిక్ ,రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓటు బ్యాంకు. సిద్ధం సభలతో బస్సు ప్రచారం క్యాడర్లో జోష్.. మహిళా ఓటింగ్ శాతం పెరగడం. అలాగే ఐ ప్యాక్ టీమ్ పోల్ మేనేజ్మెంట్..

ఇక కూటమికి గల కాన్ఫిడెంట్ ఏమిటంటే..
వైసిపి ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత అని.. నారా లోకేష్ పాదయాత్ర చంద్రబాబు అరెస్టు.. అలాగే టిడిపి జనసేన బిజెపి పొత్తు కుదరడం. సోషల్ మీడియా ఉపయోగించి అధికార పార్టీ పైన విమర్శలు చేయడం. ఎప్పుడు లేని విధంగా ముందుగానే సీట్ల ప్రకటన చేయడం. అలాగే తాము ప్రవేశపెడుతున్న సూపర్ సిక్స్ హామీలు ప్రజలలోకి బాగా వెళ్లడం వల్లే గెలవడానికి ధీమా గల కారణం అంటున్నారు కూటమి. మరి ఏం జరుగుతుందో జూన్ 4వ తేదీ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: