సైఫ్- కరీనా.. విడిపోతున్నారా.. సాక్ష్యం ఇదే..!

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు బాటపడుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్లో వరుసగా స్టార్ హీరోలు కూడా విడాకులు తీసుకుంటున్నారు. గడిచిన కొద్ది రోజుల క్రితం హీరో ధనుష్, రజనీకాంత్ ఐశ్వర్య విడిపోగా నిన్నటి రోజున నటుడు జీవి ప్రకాష్ కూడా విడాకులు తీసుకోవడం జరిగింది.దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు కూడా ఒక స్టార్ హీరో భార్య తన పేరును టాటో నుంచి తొలగించడంతో బాలీవుడ్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. వాటి గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ లో బెస్ట్ జోడిగా పేరుపొందిన సైఫ్ అలీఖాన్.. కరీనాకపూర్ జంట కూడా ఒకటి.. అయితే ఈ జంట ఇప్పుడు విడిపోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అందుకు గల కారణం సైఫ్ అలీఖాన్ కు గతంలో తన చేతి పైన కరీనా అనే పేరుతో ఉన్న టాటో అందరికీ తెలిసిందే.. ఇప్పుడు తాజాగా ఆ పేరును తొలగించడం పైన బాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది.  ఈమధ్య కాలంలో వీరిద్దరు ఎక్కడా కూడా కలిసి కనిపించలేదు.. కరీనాకపూర్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోవడమే కాకుండా సినిమాలలో కూడా ఎక్కువగా నటిస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ వార్తలకు మరింత ఊపునిచ్చింది.

సైఫ్, కరీనా పేరున టాటో ను తన ఎడమ చేతి పైన తీసివేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కరినా అనే పేరును తీసివేసి ఆ ప్లేస్లో ఒక త్రిశూలం టాటోను వేయించుకున్నారు సైఫ్ అలీఖాన్ తాజాగా ఎయిర్పోర్టులో ఆయన టాటోను దాచే ప్రయత్నం చేసినప్పటికీ అందుకు సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయం పైన ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.. గతంలో కూడా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే ఎట్టకేలకు అలాంటి వార్తలు రణవీర్ సింగ్. మరి సైఫ్ ,కరీనా ఇద్దరు కూడా అలాగే చెక్ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: