రిపబ్లిక్ మూవీ : నటించమంటే జీవించిన సాయితేజ్..!

NAGARJUNA NAKKA
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కోరిక ప్రకారమే రిపబ్లిక్ మూవీ ప్రేక్షకుల దగ్గరకు వచ్చేసింది. అంచనాలకు తగ్గట్టుగా మంచి ఫలితాలు సాధించింది. ఇప్పటి వరకు సినిమా తిలకించిన వారు సూపర్ డూపర్ హిట్ అంటున్నారు. హండ్రెడ్ డేస్ పక్కా అని సమాధానమిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ నటన అద్భుతమని కితాబిస్తున్నారు. అంతేకాదు దర్శకుడు దేవ్ కట్టా నేటి రాజకీయాలకు అద్దం పట్టినట్టే సినిమా తీశారని చెబుతున్నారు. థియేటర్ లోకి రాకముందు రిపబ్లిక్ మూవీ ప్రీమియర్ షో చూశారు చాలామంది నటులు.. ప్రముఖులు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్.. ఈ సినిమా విజయం ఆయన్ను త్వరగా కోలుకునేలా చేయాలని ఆకాంక్షించారు. అంతేకాదు సోషల్ మీడియాలో అటు సాయి తేజ్ కు అటు దర్శకుడు దేవ్ కట్టాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రిపబ్లిక్ మూవీలో జరిగిందే రియల్ లైఫ్ లో జరిగింది. ఇదే అందరినీ షాక్ కు గురయ్యేలా చేసింది.  ఈ సినిమాలో బైక్ పై వెళ్లే సాయి ధరమ్ తేజ్.. స్కిడ్ అయి కిందపడే సీన్ ఉంది. ఈ ఘటనలో అరకొర గాయలతో ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటాడు. ఇది చూసిన వారు సాయి ధరమ్ తేజ్ కు నిజ జీవితంలోనూ జరిగిన ప్రమాదాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన సంగతి తలచుకుంటున్నారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో సాయితేజ్ బైక్ పై వెళుతూ స్కిడ్ అయిన సంగతి గురించి ఆలోచిస్తున్నారు. అసలు దేవ్ కట్టాకు ఈ సంఘటన చిత్రీకరించాలని వచ్చిన ఆలోచన గురించి ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో చిన్నచిన్న గాయాలతో బయటపడిన సాయి ధరమ్ తేజ్.. రియల్ లైఫ్ లో మాత్రం చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చాడు.

అంత కష్టపడి నటించిన సినిమాను చూసే భాగ్యం సాయి తేజ్ కు లేకుండా పోయింది. ఎందుకంటే ఆస్పత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నాడు కాబట్టి. అంతేకాదు రిపబ్లిక్ మూవీ ప్రమోషన్స్ లో కూడా సాయి తేజ్ పాల్గొనలేదు. వైద్యుల నిరంతర కృషి వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు సాయి తేజ్. ఇక మూవీ చివరి పార్ట్ లో సాయి తేజ్ నటన చూసి ఎవరైనా కంటతడిపెట్టాల్సిందే. ఈ చిత్రంలో ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ అంశాలను అద్భుతంగా కళ్లకు కట్టారు. సినిమాను చూసిన వారంతా ఆలోచనలతో గడుస్తుందని సినీవర్గల్లో టాక్ వినిపిస్తోంది. అటు సాయి తేజ్ నటనలో బాగా ఎదిగిపోయాడని అంతా అనుకుంటున్నారు. వందకు వంద మార్కులు వేస్తున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: