స్టార్ హీరోల అభిమానులకు గుడ్ న్యూస్ .!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సాధారణంగా.. సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. కానీ ఆయన పిల్లలు మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏదో ఒకటి చేస్తూ సామాజిక మాద్యమాల్లో కనబడుతూనే ఉంటారు. వాటి గురించి అభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా అర్హ క్యూటీ వీడియోస్‌కి లక్షల కొద్దీ లైక్ లు వచ్చిపడుతుంటాయి. ప్రీ ప్రైమరీ చదువులోనే బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్న అర్హ, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. గుణశేఖర్, సమంత 'శాకుంతలం' సినిమాలో యువరాజు భరతుడిగా నటిస్తోంది. ఇంతకు ముందు అర్హ అన్నయ్య అయాన్‌తో కలిసి 'అల వైకుంఠపురములో' ప్రమోషన్ వీడియో చేసింది. అలాగే 'అంజలి అంజలి'కి కవర్ సాంగ్ చేసింది.
జూ.ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పెద్దగా సోషల్ మీడియాలో కనిపించరు. కానీ వీళ్లు కూడా తండ్రిలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వస్తున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. చిన్నోడు భార్గవ్ రామ్ లాంచింగ్‌కి సంప్రదింపులు కూడా జరిగాయని అప్పట్లో టాక్ వచ్చింది. మహేశ్ బాబుకి ఎంత ఫాలోయింగ్ ఉందో, ఆయన కూతురు సితారకి సోషల్ మీడియాలో అంత పాపులారిటీ ఉంది. ప్రిన్సెస్ సితార అని ప్రిన్స్ అభిమానులు కామెంట్లు పెడుతుంటారు. చార్మింగ్ లుక్స్‌తో కనిపించే సితార సినిమాల్లోకి ఎప్పుడొస్తుందని మహేశ్, నమ్రత పోస్టులకి రిక్వెస్టులు కూడా పెడుతుంటారు అభిమానులు.
మహేశ్ బాబు కొడుకు గౌతమ్ క్రిష్ణ ఆల్రెడీ సినిమాల్లోకి వచ్చాడు. మహేశ్ చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చి మధ్యలో స్టడీస్ కోసం బ్రేక్ తీసుకున్నట్లే గౌతమ్ కూడా 'వన్-నేనొక్కడినే' తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. ఈ మూవీలో చిన్నప్పటి మహేశ్ బాబులా నటించాడు గౌతమ్. పవన్ కళ్యాణ్ కొడుకు అకీర నందన్ కనిపిస్తే చాలు పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి బోల్డంత ఎనర్జీ వస్తుంది. ఫ్యూచర్ పవర్ స్టార్ అని కామెంట్లు పెడుతుంటారు. అకీర ఇంక కెరీర్‌ప్లాన్స్ మొదలుపెట్టలేదని రేణు దేశాయ్ ఇప్పటికి చాలా సార్లు చెప్పింది. అయినా పవన్ ఫ్యాన్స్ మాత్రం అకీరా ఎంట్రీ పక్కా అనే ఆలోచనలోనే ఉన్నారు. పవర్ స్టార్ వారసుడి లాంచింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. చూద్దాం.. హీరోలు.. తమ అభిమానులను ఏ విధంగా సంతృప్తి పరుస్తారో.