జిగేల్ రాణి, జిగేల్ రాజా.. దుమ్ముదులిపేశారు!

Veldandi Saikiran
రామ్ చరణ్ తేజ్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జంటగా తెరకెక్కిన సినిమా రంగస్థలం. ఈ సినిమా స్టార్ డైరెక్టర్... సుకుమార్ తెరకెక్కించారు. ఈ రంగస్థలం సినిమా 2018 సంవత్సరంలో విడుదల అయింది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరు యువకుడిలా అందరినీ కనువిందు చేశాడు. అటు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇరగదీశాడు. ఈ సినిమా అటు రామ్ చరణ్... ఇటు దర్శకుడు సుకుమార్ కు మంచి పేరు తీసుకు వచ్చింది. ఇది ఇదిలా ఉంటే... ప్రతి సినిమాల్లో లాగే ఈ సినిమాలోనూ ఓ ఐటమ్ సాంగ్ పెట్టారు దర్శకుడు. 

ఈ సినిమాలో "జిల్ జిల్ జిగేలు రాణి" అనే ఐటెం సాంగ్ ను పెట్టింది చిత్రబృందం. అయితే  ఈ పాటలో... ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్టెప్పులేసింది.  ఈ పాటకు చంద్రబోస్... లిరిక్స్ అందించగా... రీలా కుమార్ మరియు గంటా వెంకట లక్ష్మి స్వరాలను అందించారు. ఇక ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక  పూజా హెగ్డే మరియు  రామ్ చరణ్ ఈ ఐటమ్ సాంగ్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. " ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి.. కమ్మనైన కొట్ట వే జిగేలు రాణి " అంటూ సాగే ఈ పాటలో... హీరో రామ్ చరణ్ అంటే... పూజా హెగ్డే చెప్పులే హైలెట్ గా నిలిచాయి.

 "జిల్ జిల్ జిల్ జిగేలు రాజా... నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా... ఉన్నత అడిగితే నేను లేదంట" అంటూ పూజా హెగ్డే తన ఎద అందాలను చూయించి... తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పసుపు కలరు చీర, ఎర్రటి బ్లౌజ్ తో... తెలుగు ప్రేక్షకులకు మత్తెక్కించింది పూజా హెగ్డే.ఇక ఈ పాట... టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. 2018 సంవత్సరం నుంచి.. ఇప్పటి వరకు అందరి నోట్లో నూ... ఈ "జిల్ జిల్ జిగేలు రాణి" పాట నానుతూనే ఉంది. వ్యూస్ మరియు క్రేజ్ లోనూ జిగేలు రాణి పాట... దుమ్ము లేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: