కృష్ణ ఏడాదికి ఎన్ని సినిమాలు రిలీజ్ చేసేవారో తెలుసా...?
ప్రేక్షకులకు ఏదైనా కొత్త టెక్నాలజీ ను తీసుకు రావడం మరియు కొత్త కథలతో కూడిన సినిమాలు వైవిధ్యంగా తెరకెక్కించడం కృష్ణ కే సాధ్యం అన్నట్లుగా తెలుస్తుంది.ఇక ఈయన 1964 నుంచి 1995 వరకుసుమారు 300 సినిమాలలో నటించాడని సమాచారం.అప్పటికి సంవత్సరానికి సుమారు 10 సినిమాల చొప్పున నటించాడని కృష్ణ గారి మేకప్ మాన్ అయిన మాధవరావు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారని సమాచారం.
ఇక సూపర్ స్టార్ కృష్ణ ఒకే సంవత్సరంలో సుమారుగా 22 సినిమాలు చేశారని అని చెప్పుకొచ్చారట.ఈ విడుదలైన సినిమాలలో 18 సినిమాలు ఒకే సంవత్సరం విడుదల అయ్యాయని అని చెప్పినట్లు సమాచారం.ఇక ఆయన భార్య అయిన విజయనిర్మల తో కలిసి విజయవాడ కి వెళ్ళినప్పుడు ఎటు చూసినా కృష్ణ గారి వాల్ పోస్టర్లు ఉంటాయని మాధవరావు తెలిపారట.
కృష్ణ అప్పట్లో ఎన్నో సినిమాలలో రాత్రి పగలు కష్టం తెలియకుండా సినిమా మీద గౌరవం తో ఎంతో ఇష్టంగా పనిచేసేవారని తెలియజేశారు.ఒక సారి కథ విని ఆ కథను ఓకే చేసారంటే తిరిగి ఆ కథను మార్చేవారు కాదన్నట్లుగా మాధవరావు తెలిపారని సమాచారం.మోసగాళ్లకు మోసగాడు సినిమాని కేవలం ఒక నెల లోపలే పూర్తి చేసినట్లు మాధవరావు చెప్పుకొచ్చారాట.హీరో కృష్ణ 2010 వ సంవత్సరంలో సినిమాలకు మరియు రాజకీయాలకు దూరమైనట్లు చెప్పారని సమాచారం.
ఇక కృష్ణ తనయుడిగా వచ్చిన మహేష్ హీరోగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. అనతి కాలంలోనే స్టార్ హీరో గా ఎదిగారు.కృష్ణ ఎన్నో ఉత్తమ నటుడి అవార్డులను, ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నారట.కృష్ణ తనతో తీసిన నిర్మాత సినిమా ఫ్లాపయితే కృష్ణ వారిని ఏదో విధంగా ఆదుకునేవాడని మాధవరావు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ తను సినిమాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడని సమాచారం.