మరో స్పోర్ట్స్ థ్రిల్లర్ కు ఓకె చెప్పిన నారప్ప ?

VAMSI
గతంలో కనుక చూస్తే విక్టరీ వెంకటేష్ చిత్రాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు గా ఉండేవి. వెంకీ ఈ జోనర్ లోనే ఎక్కువగా కథలను ఎంపిక చేసుకునే వారు. ఈ తరహా చిత్రాలలో ఓ వైపు హీరోయిజం చూపిస్తూనే మరో వైపు కామెడీని పండించి కడుపుబ్బ నవ్వించేవారు. సెంటిమెంట్ సీన్లలో తన నటన చూస్తే మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అంతగా పాత్రలో ఒదిగిపోతారు వెంకీ. అయితే వెంకీ ఈ మధ్య వైవిధ్యభరిత చిత్ర కథలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఓ వైపు ఎఫ్ 2 వంటి చిత్రాలతో  అలరిస్తూనే....గురు వంటి డిఫరెంట్ స్టోరీతో మనముందుకు వచ్చి సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇటీవలే విడుదలైన నారప్ప చిత్రంలోనూ వైవిధ్యభరితమైన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు వెంకీ. 

ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో.... ఇప్పుడు మరో క్రీడా నేపథ్యంలో సాగే ఓ పవర్ఫుల్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాక్సింగ్ ఆటను కేంద్రంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం గురు. ఈ సినిమాలో వెంకీ ఒక కోచ్ గా కనిపించగా... ఈ నూతన చిత్రంలో  ప్లేయర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వెంకీ తో పాటు తమిళ్ హీరో విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్ గా ప్రత్యర్ధిక కోచ్ గా కనిపించబోతున్నాడట విజయ్ సేతుపతి.
హీరోయిన్ గా కాజల్ పేరు వినిపిస్తోంది.

హీరోయిన్ కాజల్ ఈ మూవీలో మరో ప్లేయర్ గా రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. గురు సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు  టాక్ వినిపిస్తోంది. అయితే ఇంతకీ ఈ కథ కోసం ఎంచుకున్న క్రీడ ఏమిటి, అఫీషియల్ అనౌన్స్మెంట్  ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు తెలియాల్సి ఉండగా....ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: