ఆ రేటుకు అమ్ముడుపోయిన పవన్‌కల్యాణ్ మూవీ ఆడియో రైట్స్..?
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ సినిమాలోని ఒక పాటను పవన్ కల్యాణ్ ఆలపించనున్నారట. ఈ ఆసక్తికర విషయాన్ని తమన్ వెల్లడించగా.. సినిమా ఆడియోపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది. తమన్ సంగీతానికి పవన్ గాత్రం తోడైతే.. అభిమానులకు పూనకాలే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇటువంటి అదిరిపోయే ఆడియోని సొంతం చేసుకోవాలంటే ఎన్ని కోట్లు చెల్లించాలో ఊహించుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయని సమాచారం.
ప్రస్తుతం సినీ వర్గాల్లో అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ రైట్స్ అమ్ముడుపోయాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ప్రకారం మూవీ ఆడియో రైట్స్ ని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా మొత్తంలో డబ్బులు చెల్లించి మ్యూజిక్ రైట్స్ ని కొనుగోలు చేసిందని సినీ వర్గాల్లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత రేటుకు అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. చిత్ర బృందం నుంచి ఆడియో రైట్స్ విక్రయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుందని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజుల క్రితం పునః ప్రారంభమయింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన సెట్స్ లో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అని సమాచారం.