శ్రీ దేవి తన చెల్లితో విడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా..?

Divya
అలనాటి హీరోయిన్లలో ఒకరైన శ్రీదేవి, ఇంత గొప్ప నటో మనందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్ని అనుకోని సంఘటనల చేత ఆమె మరణించడం జరిగింది. ఇక శ్రీదేవికి ఒక సోదరి ఉన్నట్లు కొంతమందికి మాత్రమే తెలుసు. అంతే కాకుండా తను సినిమాలలో నటిస్తున్నట్లు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆమె ఎవరో తెలుసుకుందాం.

వాస్తవానికి ఆమె తన సొంత సోదరి అయితే కాదు తన కజిన్ సిస్టర్ అట. కానీ శ్రీదేవి మాత్రం తనని సొంత చెల్లి లాగానే భావిస్తోందట. ఆమె పేరు" శ్రీలత". శ్రీదేవి చెన్నైలో ఉన్నప్పుడు వీరిద్దరికీ మంచి బంధం ఉండేదట. శ్రీదేవి ఒకానొక సమయంలో తన చెల్లెలే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చిందట పలుసార్లు. శ్రీదేవి ఏవైనా కొత్త డ్రస్సులు వేసుకున్నదంటే.. తనకు కూడా కావాలని శ్రీ దేవి తల్లి దగ్గరికి వెళ్లి గారాబం చేసేదట శ్రీలత.


ఒకసారి శ్రీదేవి తన చెల్లి  పట్టుబడడంతో శ్రీదేవి నటించిన సినిమా ను  ఇద్దరూ కలిసి చూడడానికి వెళ్లారు .అక్కడ సినిమా లో వచ్చిన ఒక ఎమోషనల్ సీన్ ని చూసి,  శ్రీదేవిని  శ్రీలత టీజ్ చేసేది. ఇద్దరు సినిమా థియేటర్ లోనే కొట్లాడుకోవడం ,తిరిగి మళ్ళీ ఇంటికి కలిసి రావడం అలా జరుగుతూ ఉండేది. ఇక శ్రీలతకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టం అంటే, శ్రీదేవి ఎంత రాత్రి అయినా సరే షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత, తన అక్క తో మాట్లాడకుండా నిద్రపోయేది కాదు.అంతలాతనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. అంతేకాదు శ్రీదేవితో ఒకరోజు మాట్లాడకపోయినా శ్రీలతకు నిద్రపట్టేది కాదు. ఇక ఈ సినిమా షూటింగ్ లకు వెళ్ళడం మాత్రం శ్రీలతకు ఇష్టం ఉండేది కాదు. కాబట్టి తన అక్క కోసం ఎదురు చూస్తూ ఉండేది.

అంత ప్రేమగా ఉండే, వీరి మధ్య గొడవలు వచ్చాయి. అవి ఎలా అంటే కొంత కాలం తర్వాత శ్రీలత సంజయ్ రామస్వామి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక వీరిద్దరి మధ్య ఆస్తి గొడవలు వచ్చి , దాదాపుగా 17 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు. ఆతర్వాత బోనికపూర్ పుణ్యమా అని వీరిద్దరూ ఒకటయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: