విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న టాలీవుడ్ స్టార్స్ ?

Divya
సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు పలు సందర్భాలలో ప్రయాణించేటప్పుడు యాక్సిడెంట్ అయి చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు. అయితే మరికొంతమంది అలా యాక్సిడెంట్ అయ్యి బతికిన వారు కూడా ఉన్నారు. అప్పుడు, ఇప్పుడు సినీఇండస్ట్రీ లో విమాన ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే అలా విమాన ప్రమాదం నుంచి ఎంతమంది హీరోలు తప్పించుకున్నారో ఒకసారి తెలుసుకుందాం.

1993 నవంబర్ 15న విమానంలో ఎంతో మంది సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులు, వారితో పాటే తమిళ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు, మొత్తం అందరిని కలుపుకొని అందులో 272 మంది ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తున్న విమానం కొన్ని కారణాల చేత ఆ విమానం ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. కానీ ఒక్కసారిగా విమానం నేల మీద పడడం తో అంత షాక్కు గురయ్యారు.

అలా పడిన విమానంలో ఉన్న ప్రయాణికులు మొత్తం సురక్షితంగా బయటికి రావడం జరిగింది. అయితే అందులో  మన తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, చిరంజీవి, విజయశాంతి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, ఇంకా ప్రముఖులు మొత్తం అందరూ కలిసి, అందులోనే ప్రయాణం చేస్తున్నారు. ఇక మరికొంతమందిలో దిగ్గజ దర్శకధీరులు కూడా ప్రయాణిస్తున్నారు.

అలా ఎందుకు జరిగింది అంటే విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. అలా ల్యాండింగ్ కోసం విమానానికి ఉండేటువంటి స్లాట్ట్స్ తెరుచుకోకపోవడం, దానికి తోడు వాతావరణం కూడా  సహకరించకపోవడంతో, ఇలా  ప్రమాదానికి గురి అవ్వాల్సి వచ్చిందట. అయితే వీరందరిని ఆ దేవుడే కాపాడారు అని చెప్పుకోవచ్చు. ఇక ఇందులోనే ప్రయాణిస్తున్న" కెప్టెన్ బల్ల, వెల్రాజ్"ఇద్దరు పైలెట్లు. వీరి సమయస్ఫూర్తితోనే గుడ్డంపల్లి గ్రామాలలోనీ పొలాలలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇక అంతే కాకుండా ఒక్క రెండు నిమిషాలు ముందు ల్యాండింగ్ చేసినా కూడా, ఒక పెద్ద చెరువులో పడి ఉండేవారట.


ఏదిఏమైనా అప్పట్లో ఈ విమాన ప్రమాదం సినీ ఇండస్ట్రీని చాలా భయభ్రాంతులకు గురి చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: