బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులతో తాత..!
తెలుగు ఇండస్ర్టీలో ఉన్న టాప్ హీరోల్లో బాలకృష్ణ కు క్రేజ్ మామూలుగా ఉండదు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా బాలకృష్ణ సినిమా విడుదలవుతుందంటే ఆయన అభిమానులు చేసే కోలాహలం మామూలుగా ఉండదు. అభిమానులు ముద్దుగా బాలయ్య బాబు అని పిలుస్తూ... ఉంటారు. ఈయన రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటారు. లేటు వయసులో కూడా ఆయన నటించే సన్నివేశాలను చూస్తే ఔరా అనిపిస్తుంది. తాజాగా ఫుల్లుగా మద్యం తాగిన వ్యక్తి వానలో బాలయ్య బాబు పాటకు చిందేసిన వైనం చూస్తుంటే అబ్బా అని అనిపించక మానదు. అసలే ఫుల్లుగా లోడ్ లో ఉన్న అతను పైన వర్షపు చినుకులు పడుతుంటే పక్కన బాలయ్య బాబు హిట్ సినిమా లోని పాట వస్తుంటే తన కాళ్లకు పని చెప్పాడు.
ఇప్పుడు అతడు ఒళ్లు మరిచి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే...ఎక్కడ జరిగిందో కానీ ఫుల్లుగా మద్యం సేవించిన వ్యక్తి గొడుగు చేతిలో పట్టుకుని చినుకులకు తడవకుండా వెళ్తున్నాడు. ఇంతలో బాలయ్య బాబు నటించిన హిట్ సినిమా బంగారు బుల్లోడు సినిమాలోంచి స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన అనే పాట రావడం మొదలైంది. దీంతో నిషాలో ఉన్న ఆ వ్యక్తి ఒళ్లు మరిచి పోయి డాన్య్ ఇరగదీశాడు. డ్యాన్స్ చేస్తున్నంత సేపు ఆ వ్యక్తిలో కనిపించిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే మాత్రం అతడు ఎంతలా మైమరిచిపోయి ఆ పాటకు డ్యాన్స్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒళ్లు మరిచిపోయి ఆ వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా... కొందరు మొత్తం ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోను చూసిన బాలయ్య బాబు అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా డ్యాన్స్ ఇరగదీశాడంటూ కామెంట్లు చేస్తున్నారు.