తెలంగాణ రాష్ట్రం సాకారం అయినప్పటి నుంచి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ అధికారంలోకి ఉంది. 2014, మరియు 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఘన విజయం సాధించింది. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించడం కారణంగా తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి పట్టం కడుతున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ హవా ఇంకా కూడా కొనసాగుతోంది. రాష్ట్రం తేవడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజల మెప్పు పొందింది టిఆర్ఎస్ ప్రభుత్వం. కల్యాణలక్ష్మి, ఆసరా, రైతుబంధు ఇలా అనేక సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పై నేషనల్ లీడర్స్ తో పాటు ప్రముఖ నటులు కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో కమెడియన్ సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న కెసిఆర్ కు.... ఐ లవ్ యూ కూడా చెప్పాడు ఆ స్టార్ కమెడియన్. అతను ఎవరో కాదు కమెడియన్ లోబో. పటాస్ లాంటి కొన్ని కామెడీ షో లలో ప్రేక్షకులను చాలా అలరించాడు లోబో. అయితే తాజాగా కొత్తగా నిర్మించిన బాలనగర్ ఫ్లైఓవర్ పైకి వెళ్ళిన లోబో... తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించాడు. బాల్ నగర్ బ్రిడ్జి చాలా అందంగా ఉందని.... దీని వల్ల ట్రాఫిక్ సమస్య చాలా తగ్గిందని పేర్కొన్నాడు.
ఇలా హైదరాబాదులో ఉన్న తెలుగు ప్రజలకు సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు అని పేర్కొన్న లోబో..." ఐ లవ్ యు కెసిఆర్" కొనియాడారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా ఇటీవలే మంత్రి కేటీఆర్ బాల నగర్ ఫ్లైఓవర్ ప్రారంభించారు. 2017 లో ప్రారంభమైన ఈ ఫ్లైఓవర్ ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. ఏకంగా ఈ ఫ్లైఓవర్ కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం 350 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఫ్లై ఓవర్ కారణంగా బాల నగర్ ఏరియా లో ట్రాఫిక్ సమస్య చాలా తగ్గింది.