వెంకటేష్ - సౌందర్య జంటగా వచ్చిన సినిమాలు..

Divya
మన సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జంటలకు ఒక ప్రత్యేకమైన అభిమానం ప్రేక్షకులలో ఉంటుంది. ఇక అలాంటి జంటలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న జంట సౌందర్య - వెంకటేష్. అయితే సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో ఇప్పుడు తెలుసుకుందాం..

1. దేవి పుత్రుడు:
2001లో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు .ఇందులో సౌందర్య , అంజలా జవేరి, వెంకటేష్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ద్వాపరయుగంలో సముద్ర నీట మునిగిన ద్వారక గురించి తెలిపిన సినిమా ఇది. అయితే ఈ సినిమా పరాజయాన్ని పొందింది.

2. పవిత్ర బంధం:
1996 వ సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం పవిత్ర బంధం. మాంగల్య బలం యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని చక్కగా చూపించారు ఈ చిత్రంలో. ఒక సౌందర్య, వెంకటేష్ కలిసి నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

3. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు:
1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది . ఇందులో వినీత, సౌందర్య, వెంకటేష్ కలిసి నటించారు. వాణిజ్య పరంగా ఈ చిత్రం మంచి లాభాలను సాధించిపెట్టింది అని చెప్పవచ్చు.

4. రాజా :
1999వ సంవత్సరంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్.బి.చౌదరి నిర్మించిన చిత్రం రాజా. ఇక ఈ చిత్రాన్ని ముప్పలనేని శివ డైరెక్ట్ చేశారు.

5. పెళ్లి చేసుకుందాం:
1997 సంవత్సరంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పెళ్లి చేసుకుందాం.. వెంకటేష్, సౌందర్య కలిసి నటించిన ఈ  చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి సంచలనం సృష్టించింది.


వీటితో పాటు మరికొన్ని చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి, సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు వీరిద్దరూ వరుసగా సినిమాలు తీస్తూ వుండటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరకు ఏమీ లేదని కూడా తెలిసింది. ఇక ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో వీరిద్దరిదీ బెస్ట్ జోడీ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: