‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రియ. ఆ తర్వాత స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన శ్రియ ఆండ్రూను పెళ్లాడింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రియ తన భర్తతో చేసే చిలిపి పనుల గురించి ఎప్పటికప్పడు అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. శ్రియ-ఆండ్రూ సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్‌చల్ చేస్తుంటారు. శ్రియ తన అభిమానుల కోసం బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేస్తుండగా, అవి చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఈ జంట హాలీడే ట్రిప్‌లోని వీడియోస్ షేర్ చేశారు. అవి నెట్టింట ట్రెండవుతున్నాయి.
తన భర్త ఆండ్రూ బోటులో ఎక్సర్ సైజ్ చేసే వీడియోను శ్రియ షేర్ చేయగా, అది చూసి నెటిజన్లు యూ ఆర్ లక్కీ మ్యాన్ అని, హ్యాపీ ఫెల్లో అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, శ్రియ భర్త ఆండ్రూ శ్రియ భయపడుతున్న వీడియో ఒకటి షేర్ చేయగా అది అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో రష్యా వీధుల్లో శ్రియ తిరుగుతుండగా రోడ్డుపై అనుకోకుండా ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతాడు. ఈ క్రమంలోనే అతడు ముఖం లేకుండా బయటకు వచ్చి తనతో మాట్లాడుతుండగా, అది చూసి శ్రియ పరుగెత్తింది.
Your browser does not support HTML5 video. మాస్టర్ మ్యాజిక్ టెక్నిక్‌లో భాగంగా సదరు వ్యక్తి హెడ్ బయటకు తీయగా అది చూసి శ్రియ భయపడింది. ఇదంతా ఆండ్రూ కెమెరాలో బంధించి, ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టాడు. దాంతో శ్రియను భయపెట్టిన వ్యక్తి ఎవరు? అనే చర్చ మొదలై వీడియో వైరలవుతోంది. ఈ వీడియో మాత్రమే కాకుండా గతంలో శ్రియ తన భర్తతో చేసిన చిలిపి పనులకు సంబంధించిన వీడియోలూ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండయ్యాయి. శ్రియ ప్రస్తుతం దర్శకధీర ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆ సినిమాతో పాటు ‘గమనం, నరగసూరన్, తడ్క’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నది.