సిఎం కొడుకుతో స్టార్ హీరోయిన్ రొమాన్స్ ?

Veldandi Saikiran
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో... సినిమా షూటింగులు ఒక్కొక్కటిగా షురూ అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్స్ ప్రారంభించగా... మరి కొన్ని ట్రాక్ పైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే...  కొత్త సినిమాలు కూడా యాక్టర్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఇస్మార్ట్ బామ...నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే 2019లో స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో... నిధి అగర్వాల్ మంచి పేరు కొట్టేసింది. 
ఆ సినిమా అనంతరం... నిధి అగర్వాల్ ను ఇస్మార్ట్ బామ్మగా పిలిచే ఎంతగా ఆమెకు అంతలా పేరు వచ్చింది.  టాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికీ... ఇస్మార్ట్ శంకర్ మూవీ నిధి అగర్వాల్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అయితే తాజాగా నిధి అగర్వాల్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు... ఉదయ నిధి స్టాలిన్ తో... నిధి అగర్వాల్ కు నటించే అవకాశం వచ్చినట్లు  సమాచారం. ఎప్పటినుంచో కోలీవుడ్ పరిశ్రమలో సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కు... తాజాగా ఈ అవకాశం వచ్చింది. 
ఉదయ నిధి స్టాలిన్ మరియు నిధి అగర్వాల్ చేస్తున్న సినిమాకు స్టార్ డైరెక్టర్ మగిల్ తిరుమణి దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఉదయనిధి స్టాలిన్ కు చెందిన ఓన్ ప్రొడక్షన్ అయినా రెడ్ జెయింట్ మూవీస్ ఈ మూవీ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.   కాగా ప్రస్తుతం ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో వస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా  లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదలకానుండగా.. ప్రస్తుతం షూటింగ్ దశ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: