అప్పట్లో వివాదాలను సృష్టించిన సినిమాను వదులుకున్న హీరో ఎవరో తెలుసా ?

Divya

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు  కొన్ని సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం అతి సాధారణమైన విషయం. కథ పరంగా ఆ సినిమా ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటే, ఖచ్చితంగా ఆ సినిమా వివాదాలను ఎదుర్కోక తప్పదు. అలాంటి సినిమా దేశం మొత్తం వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ మంచి ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం ఏదో కాదు 1995 మార్చి 10వ తేదీన మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన చిత్రం "ముంబాయి". ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎంతో మంది హీరోలు క్యూ కడతారు అన్న విషయం తెలిసిందే.

ఇక ఆయన దర్శకత్వంలో సినిమా అంటే హీరో క్రేజ్  మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మణిరత్నం డైరెక్షన్ లో  సినిమా దొరకడం అంటే ఎంతో అదృష్టం వుండాలి. యదార్థగాథలతో, సృజనాత్మకతతో ఈయన సినిమాలు ఉండడం గమనార్హం. ఈయన దర్శకత్వం చేసే సినిమాలు సగటు మనిషి జీవితాన్ని అద్దం పడతాయి. ఇంతటి గొప్ప దర్శకుడు 1992 రోజా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇక ఈ చిత్రంలో మధుబాల, అరవింద స్వామి నటించారు. ఇక ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్ ను అందుకోవడం విశేషం.


ఆ తర్వాత 1993లో దొంగ దొంగ అనే  సినిమా తీస్తున్న సమయంలో ముంబైలో అల్లర్లు జరిగి మణిరత్నం మనసును కలచివేశాయి. ముంబై లో బాగా ఫేమస్ అయిన బాబ్రీ మసీదును కూల్చి వేయడంతో ఒక వర్గ ప్రజలు, ఇంకొక వర్గ ప్రజలపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యదార్థ సంఘటన తీసుకొని మణిరత్నం తెరకెక్కించాలని అనుకున్నారు. మొదటిసారి ఈ కథను  హీరో విక్రమ్ కి వినిపించగా, అప్పుడు ఆయన గడ్డం, జుట్టు బాగా పెరిగిపోయి కనిపించారట. మణిరత్నం గారు విక్రమ్ ను ఈ సినిమాలో క్లీన్ షేవ్ చేసుకోవాలి అని చెప్పడంతో, విక్రమ్ ఇష్టంలేక ఈ సినిమాను వదులుకున్నారు.

ఇక చివరికి ఈ  సినిమాను  రోజా సినిమా హీరో అరవిందస్వామితో తీశారు మణిరత్నం. ఇక విడుదలైన తర్వాత ఈ చిత్రం ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. హైదరాబాదులో ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల ను కూడా మూసివేయడం జరిగింది. దేశవ్యాప్తంగా నిరసనలు అందుకున్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని భాషలలో  విడుదల అయ్యి, దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: