చిరంజీవి చెల్లెలిగా.. నాగార్జున భార్య ..
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా చిరంజీవి ఫ్యామిలీ, నాగార్జున ఫ్యామిలీ ఎంతో అన్యోన్యంగా ఉంటారని తెలుసు.ఇప్పుడు ఆ అన్యోన్యానికి నిదర్శనం చిరంజీవి చెల్లెలిగా అమల నటించబోతోంది. ఇన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అమల తిరిగి చిరంజీవి నటించబోయే సినిమాలో చెల్లెలి పాత్రలో నటించనుందట. ఆ సినిమా ఏంటి..?ఈమె నిజంగానే నటిస్తోందా? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని అమల తెలుగు,హిందీ,మలయాళం భాషలలో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మొదటి 1986 వ సంవత్సరంలో తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులోకి 1987లో నాగార్జున నటించిన " కిరాయి దాదా" సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక అమలాకు భరత నాట్యం అంటే చాలా ఇష్టమట.
ఇక అసలు విషయానికి వస్తే, మెగాస్టార్ రీమిక్స్ చేయనున్న"లూసిఫర్" సినిమా కొన్ని కారణాల చేత వెనకబడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాపై ఒక ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లెలిగా"అమల"నటించబోతోందని సినీ వినికిడి. కానీ ఈ విషయం నమ్మశక్యంగా లేకపోయినా,ఆ క్యారెక్టర్ కు ఆమె మాత్రమే కరెక్ట్ గా సరిపోతుందని అనుకుంటున్నారట. ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.
లూసిఫర్ చిత్రంలో "సోదరి" పాత్రకు చాలా ప్రాధాన్యత కలిగి ఉండడంతో, మలయాళంలో కూడా అక్కడ ఒక పాపులర్ హీరోయిన్ "(మంజు వారియర్)" ఆ క్యారెక్టర్ లో నటించడం జరిగింది. ఈ సినిమాలోని ఎమోషనల్ తో కూడిన సెంటిమెంట్లను అమల చేస్తేనే సినిమాకి ఎంతో హైప్ ఉంటుందని భావిస్తున్నారు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలోనే అమలా కూడా సినిమాల వైపు ఫోకస్ పెట్టింది. ఇలాంటి పాత్ర వస్తే ఆమె వదులుకోరు అని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై లూసిఫర్ టీమ్ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.
అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసిని పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. ఇక చివరికి ఈ సినిమాని ఎవరు సెట్స్ మీదికి తీసుకొస్తారో, ఇందులో ఎవరు ఏ పాత్రలో నటిస్తారనే విషయంపై త్వరలోనే తెలుస్తుంది.