డేటింగ్ ఓకే.. నో మ్యారేజ్..అంటున్న సినీ భామలు..

Divya

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది భామలు.. పలువురు దర్శకులు, సినీ హీరోలతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇలా డేటింగ్ లో ఉంటున్న వారిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడిగితే మాత్రం వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. అలా మన సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు డేటింగ్ లో ఉంటూ,  పెళ్లి అనగానే నోరు మెదపడం లేదు. అలాంటి వారు మన సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఉన్నారో ..?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


1. నయనతార:
ఇంతకుముందు నయనతార ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది.కానీ అతనితో విభేదాలు రావడంతో గత కొంత కాలంగా దూరంగా ఉంటోంది.కానీ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉంది. కానీ వీరిద్దరినీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు అని అడిగితే మాత్రం నోరు విప్పడం లేదు. వీరిద్దరూ ఒక పక్క సినిమాలు, మరో పక్క డేటింగ్ చేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.


2.కియారా అద్వానీ:
ధోని సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందిన కియారా అద్వానీ ,ఆ తర్వాత రామ్ చరణ్  సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది.ఈ భామ  బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తో  డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే  కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు అంటూ మాట తిప్పేస్తున్నారు.

3. అవికా గోర్:
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ  అందుకున్న అవికా గోర్ గత కొద్ది కాలం నుండి మిలింద్ అద్వానీతో ప్రేమ లో ఉంది. అతని తరపు నుంచి ఎప్పుడు ఓకే అంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.

4. అలియా భట్:
ఈ ముద్దుగుమ్మ రణ్ బీర్  కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఈ జోడికి మంచి క్రేజ్ కూడా ఉంది. వీరు కూడా పెళ్లి విషయానికొస్తే నోరుమెదపడం లేదు.


5. మలైకా అరోరా:
మలైకా అరోరా  కూడా తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో గత కొద్ది కాలం నుండి డేటింగ్ చేస్తోంది. వీరు కూడా పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదు.

6. కత్రినా కైఫ్:
స్టార్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమాయణం నడుపుతోందని, వీరిద్దరు బయట తిరుగుతూ సోషల్ మీడియా కంటే కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీరు కూడా  ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనబడడం లేదు.

7. శృతిహాసన్:
కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ కూడా ప్రస్తుతం సంతాను హజారికా తో డేటింగ్ లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: