అప్పట్లో వివాదాల్లో చిక్కుకున్న హీరో సుమన్..
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగాలంటే చాలా కష్టం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే అదృష్టం కలిసి రాకపోతే , సినీ ఇండస్ట్రీలో నిలవలేరు. ఇక ఇండస్ట్రీలో ఎదురయ్యే జయపజయాలను తట్టుకొని నిలబడాలంటే చాలా కష్టం. ఎంతో మంచి క్రేజ్ సంపాదించిన హీరో ఒక్కసారిగా తన స్టార్డం అంతా పడిపోతే, మళ్లీ స్టార్ గా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం అంటే మాటలు కాదు. అలాంటి హీరోలలో "సుమన్" ఒకరు. అయితే సుమన్ గారి గురించి మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
సుమన్ ఆరడుగుల అందంతో,తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈయన అసలు పేరు సుమన్ తల్వార్, ఆయన మాతృభాష తెలుగు కాకపోయినా సినిమాలలో ఎంతో చక్కగా మాట్లాడి బాగా ప్రేక్షకాదరణ పొందారు. ఈయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు సినీ హీరో "భాను చందర్"తో మంచి స్నేహం వుండేది.
ఒకానొక సమయంలో చిరంజీవి తో పోటీగా సుమన్ సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇలా సాగిపోతున్న తన జీవితంలో ఎప్పటికీ కోలుకోవాలని ఎదురు దెబ్బ తగిలింది.. అదేమిటంటే బ్లూ ఫిల్మ్స్ కేసులో సుమన్ పేరు రావడంతో ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బెయిల్ కూడా రాని పరిస్థితుల్లో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తనను జైలుకు వెళ్లిన విషయంపై సినీ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అలాగే సుమన్ కూడా చాలా డీలా పడిపోయారు. ఆ తరువాత ఆయనకి సినిమా ఛాన్స్ లు రాక, పరువు మొత్తం పోవడంతో చాలా డిప్రెషన్ కి గురయ్యారు.
ఇక ఆ తర్వాత తన భార్య శిరీష రూపంలో మళ్లీ అదృష్టాన్ని సంపాదించుకున్నాడు. శిరీష వాళ్ళ తాతయ్య.. మామగారు బడిపంతులు, గుండమ్మకథ, రాముడు భీముడు, మరికొన్ని చిత్రాలకు ప్రముఖ రచయితగా పేరుపొందాడు. "డీవి నరసరాజు" తన మనవరాలిని హీరో సుమన్ కి ఇచ్చి వివాహం చేశాడు. ఆయన అలా పిలిచి సుమన్ కి తన మనవరాలిని ఇవ్వడంతో.. సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.
ఇక ఆ తర్వాత (పెద్దింటి అల్లుడు, బావ బామ్మర్ది)సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రలో అందరిని మెప్పించాడు. ఏది ఏమైనా సుమన్ కెరీర్ మలుపు తినడానికి తన భార్య శిరీష కారణం అని చెప్పవచ్చు.