అభిమానానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించిన ఎన్టీఆర్ ఫ్యాన్ ...!
అతనికి నిజంగానే మాటలు రావు, చెవులు కూడా వినపడవు. కానీ తన పెయింటింగ్ తో మనసులోని భావాలను పలికించగల పదునైన తన ప్రతిభను ఉపయోగించి తన లోని ఉన్నతమైన ఆలోచనలను వ్యక్తపరచగలగే ప్రతిభా పాటవాలు అతని సొంతం. అయితే కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఎంతో మంది జీవితాలు ఆర్థికంగా కుదెలైపోయాయి. అయితే పాల నాగరాజు అనే వ్యక్తి కూడా ఈ లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక చాలా సమస్యలు ఎదుర్కుంటున్నాడు. అదే విషయాన్ని తన అభిమాని ఎన్టీఆర్ పెయింటింగ్ వేసి ఓ వైపు తన అభిమానాన్ని చాటి చెబుతూనే మరోవైపు వినయంగా తన పరిస్థితిని వివరిస్తూ, సైగలతో తన బాధను వ్యక్తం చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాడు.
ఈ విపత్కర పరిస్థితుల్లో నా ఈ ప్రతిభకు ఒక్క అవకాశం ఇచ్చి నన్ను ఆదుకోండి అంటూ మాటలు రాని నాగరాజు తన మనసులోని భావాలను సవినయంగా చెప్పడానికి చేసిన ప్రయత్నాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. తారక్ అభిమానులు అయితే అతను వేసిన ఎన్టీఆర్ ఫ్యామిలీ పెయింటింగ్ చూసి మీ ప్రతిభకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది , మీ పెయింటింగ్ కి హ్యాట్సాఫ్ అంటూ ప్రసంశలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయం ఎన్టీఆర్ వరకు వెళుతుందా ? లేదా సినిమా ఇండస్ట్రీలో ఇది చూసి ఎవరైనా అవకాశం ఇస్తారా అన్నది చూడాలి.