షేర్ని ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయే పాత్రలో విద్యాబాలన్..?

Suma Kallamadi
విద్యా బాలన్‌, విజయ్ రాజ్, నీరజ్ కబీ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ అడ్వెంచర్ మూవీ షేర్ని కి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసిన 2 నిమిషాల 30 సెకండ్ల ట్రైలర్ లో విద్యాబాలన్ అడవిలో నరులను భయపెట్టే పులి కోసం వేట మొదలు పెడతారు. ఈ ట్రైలర్ లో ఆమె ఒక లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించారు. శరద్ సక్సేనా ఒక మాస్టర్ షూటర్ గా కనిపించారు. ఆయన పులి కళ్ళలో చూసి అది మనుషులను చంపుతుందో లేదో చెప్పగలను అని కూడా ఈ ట్రైలర్ లో డాంభికాలు పలకడం చూడొచ్చు. ఎంత సేపు వెతికినా పులిని పట్టుకోకపోవడం తో.. గ్రామస్తులు ఒక లేడీ ఆఫీసర్ వల్ల అయ్యేపని కాదు అని నిరాశ చెందుతుంటారు.

ఈ క్రమంలోనే ఆమె మరిన్ని భయంకరమైన విషయాలు తెలుసుకుంటారు. పులి రూపంలో వచ్చి ఒక మనిషి ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేసాడని ఒక యాక్టర్ అనడం కూడా చూడొచ్చు. ఇకపోతే 'న్యూటన్‌' ఫేమ్‌ అమిత్‌ మసూర్కర్‌ రూపొందించిన ఈ సినిమా జూన్‌ 18న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో నేరుగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మనిషికి - జంతువుకి మధ్య ఉన్న విరోధాన్ని పోగొట్టేందుకు ఫారెస్ట్ ఆఫీసర్ విద్యాబాలన్ కృషి చేస్తారని తెలుస్తోంది. జంతు హక్కుల గురించి ఆమె గ్రామస్తులకు సైతం తెలియజేస్తారని తెలుస్తోంది.



ఏది ఏమైనా విద్యాబాలన్ షేర్ని (ఆడ సింహం) సినిమాలో ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారని స్పష్టం గా తెలుస్తోంది. గత ఏడాది ఆమె శాకుంతలా దేవి చిత్రం లో టైటిల్ రోల్ లో నటించారు. ఈ సినిమా డైరెక్టుగా ప్రైమ్‌ లో జులై, 31, 2020న విడుదలై మంచి రివ్యూస్ సంపాదించింది. ఆమె సహజమైన నటనకు కూడా నూటికి నూరుశాతం మార్కులు పడ్డాయి. షేర్ని సినిమా కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టేలా ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: