వారికి సాయం చేయడానికి మరో ముందడుగు వేసిన అనుష్క శర్మ

praveen
సినీ ఇండస్ట్రీలో అనుష్క శర్మకి ఉన్న క్రేజే వేరు. ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్కా శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదెళ్ల జ్యూయలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మెడల్ గా వ్యవహరించింది. యష్ చోప్రాకు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. 

'రబ్ నే బనాదీ జోడీ' సినిమాలో ఆమె నటన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తనదైన శైలిలో పలువురికి సేవ చేస్తూ ముందుకు సాగుతోంది. అనుష్క శర్మ ఇటీవ‌లి కాలంలో ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు.
ఈమ‌ధ్య‌నే ఆమె తన భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీతో క‌ల‌సి కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం నిధులు సేకరించారు. ఇప్పుడు ఆమె గర్భవతుల‌కు, బాలింత‌ల‌కు సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. దీనికోసం అనుష్క హెల్ప్ లైన్ నంబర్‌ను షేర్ చేశారు. ఈ హెల్ఫ్‌లైన్ గర్భిణుల‌కు వైద్య సాయం అందించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. హ్యాపీ టు హెల్ప్‌ పేరిట మహిళలకు వైద్య సహాయం అందించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్ సీడబ్ల్యు) ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్‌నంబర్‌ను షేర్ చేసిన‌ట్లు అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపారు. వైద్య సహాయం అందించడానికి ఎన్ సీడబ్ల్యు బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటుంద‌ని ఆమె తెలిపారు. అనుష్క ఈ హెల్ప్ లైన్ నంబర్‌తో పాటు సంస్థ ఈమెయిల్ కూడా షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: