15 రోజుల తర్వాత కలిశాను.. బన్నీ ఎమోషనల్ ట్వీట్

Divya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల కోవిడ్ బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆయన  కోలుకొని ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. తాజా పరీక్షలో నెగిటివ్ గా నిర్ధారణ అయినట్లు , అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు.. ట్విట్టర్లో ద్వారా.. అందరికీ హాయ్.. నాకు కరోనా నెగిటివ్ తేలింది. ఆరోగ్యంగా ఉన్నాను. మీ అభిమానాలకు, మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ తన సందేశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

ఇక అంతే కాకుండా పదిహేను రోజులు తరువాత కుటుంబాన్ని కలిశాను అంటూ ట్వీట్ చేశారు. ఇక అంతే కాకుండా తన పిల్లలైనా అర్హ, అయాన్లను నేడు కలిసిన వీడియోను అల్లుఅర్జున్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.  దాదాపు రెండు వారాల పాటు తన కుటుంబాన్ని, పిల్లలను బాగా మిస్ అవుతూ తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యాడు. పోయిన నెల 28న తనకు  కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశాడు అల్లు అర్జున్.ఇక అప్పటి నుండి అల్లుఅర్జున్ సెల్ఫ్ ఐసోలేటెడ్ కావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నాడు..
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కి కరోనా నెగిటివ్ అన్న విషయం తెలుసుకుని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప షూటింగ్ కరోనా కారణంగా పలుమార్లు నిలిచిపోయింది. ఇక దర్శకుడు సుకుమార్ వీలైనంత త్వరగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ 1.5 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసుకున్నట్లు సమాచారం..

అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా పుష్ప సినిమా  ద్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోనున్నాడు. ఇక ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: