ఆ సమస్య వల్లే అక్కడ సినిమా చేయలేకపోతున్నా : నాని

Divya

నాచురల్ స్టార్ నాని టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల నాని నటించిన "టక్ జగదీశ్ " సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసింది ఈ చిత్ర బృందం యూనిట్. ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని "శ్యామ్ సింగరాయ్ " అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.  ఇక ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్‌లో రూపొందించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


ఇదిలా ఉండగా ఇటీవల మన తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్ల అందరూ బాలీవుడ్ లో నటించాలని తెగ ఆరాటపడుతున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో నటిస్తే, దేశవ్యాప్తంగా క్రేజ్ లభించే అవకాశం ఉంటుందని, అలా చాలా మంది బాలీవుడ్ వైపు వెళ్లిన స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే ఏదో ఊహించుకొని వెళ్లి,  అక్కడ డిజాస్టర్ గా మిగిలి, తిరిగి తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు కూడా ఉన్నారనుకోండి.. కాకపోతే అది వేరే విషయం. కానీ మరికొంతమంది హీరోలకు మాత్రం బాలీవుడ్ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా వారు నిర్మొహమాటంగా తిరస్కరిస్తూ, వారు మాతృభాషలోనే సినిమాలు చేయాలని భీష్మించుకుని కూర్చున్నవారు కూడా ఉన్నారు.


కానీ నాని ఇండస్ట్రీలోకి వచ్చి, ఇంత కాలం అయినప్పటికీ బాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అయితే అందరి స్టార్ హీరోలలాగే  నాని కి కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశగా ఉందట. కానీ అతను బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలంటే ఒక సమస్య ఏర్పడిందని కూడా చెప్పుకొచ్చాడు.. ఆ సమస్య ఏదో కాదు, అతనికి హిందీ భాష రాకపోవడమే.. అయితే ఇది మాత్రమే కాదు, అతను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కొన్ని నిబంధనలను కూడా విధించుకున్నాడట.


అంతేకాకుండా  తనకు కథ నచ్చాలి. ఆ కథ కోసం తాను కొత్తగా తయారవ్వాలి. హిందీ భాషలో పట్టు సాధించాలన్న కోరిక బలంగా పాతుకుపోవాలి. ఇవన్నీ జరిగితేనే, బాలీవుడ్‌లో సినిమా చేస్తానంటున్నాడు నాని. మరి నాచురల్ స్టార్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తాడో.. లేదో వేచి చూడాలి. ఇక ఇప్పటి వరకు నాని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే ఈ వార్తలన్నీ రూమర్లు గానే మిగిలిపోయాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: