పూరి జగన్నాద్ పై ఛార్మి ఫైర్.. కారణం అదేనా..?
తాజాగా పూరిపై ఛార్మి ఫైర్ అవుతుందని తెలుస్తోంది. పైగా ఛార్మి సీరియస్ అవుతుంది ఇప్పటి సినిమా గురించి కూడా కాదు. అప్పుడెప్పుడో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి. ఆ సినిమా సంచలన విజయం అందుకుని పూరి ఈజ్ బ్యాక్ అనేలా చేయడంతో పాటు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా 42 కోట్లకు పైగా వసూలు చేసిందట.
ఇక ఆ సినిమా బడ్జెట్ విషయంలో పూరి కంటే కూడా ఛార్మినే ఎక్కువ పెట్టుబడి పెట్టిందట. కానీ లాభాలు వచ్చాక మాత్రం ఛార్మి కంటే పూరినే ఎక్కువ లాభపడ్డారట. అప్పుడు తన తరువాత సినిమా విషయంలో నీకు ఎక్కువ ఎమౌంట్ వచ్చేలా చూస్తాను అని మాట ఇచ్చిన పూరి.. ఇప్పుడు ఆ మాటను మర్చిపోయాడని ఛార్మి తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని తెగ బాధ పడుతుందట.
అయితే ప్రస్తుతం పూరి, విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి తనకే ఎక్కువ లాభాలు వస్తాయి అని ఆశ పడిన ఛార్మి.. మొదటి రోజు నుండి ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడింది. కానీ తీరా లెక్కల విషయానికి వస్తే హిందీ వెర్షన్ ను కరుణ్ జోహార్ పూర్తిగా తీసేసుకున్నాడు. ఇక తెలుగు వెర్షన్ రైట్స్ ను పూరి ఉంచుకున్నాడు. దాంతో ఛార్మికి ఏం మిగలలేదు అట. మొదటి నుండి ఈ సినిమాకు ఛార్మి మొత్తం నిర్మాణ వ్యవహారాలు చూసుకుంది, కానీ ఆమె చేతిలో మాత్రం ఏ రైట్స్ లేకపోవడంతో పూరి పై ప్రస్తుతం ఛార్మి తెగ ఫైర్ అవుతుందట.