టాలివుడ్ గాసిప్స్ :ఏకంగా 54 సర్జరీలు చేయించుకున్న ఆ హీరోయిన్ సోదరి .. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Divya

నాటి నుంచి నేటి వరకు హీరోయిన్లు చాలామంది ముఖానికి సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. కేవలం హీరోయిన్లు మాత్రమే కాకుండా హీరోలు కూడా సర్జరీలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఒక హీరోయిన్ సోదరి మాత్రం ఏకంగా 54 సర్జరీలు చేయించుకున్నదట.. ఆమె ఎవరో కాదు కంగనా రనౌత్ సోదరి .. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో హీరోయిన్ కంగనా రనౌత్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ వివాదాల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది..


ఇదిలా ఉండగా తాజాగా కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన సోదరి గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన సోదరి  రంగోలి యాసిడ్ దాడికి గురైంది.  అందువల్ల 54 సర్జరీలు చేయించాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.. ఇందుకు కారణం రంగోలి ఒక వ్యక్తి ప్రేమను అంగీకరించకపోవడంతో ఆ వ్యక్తి రంగోలి పై దాడి చేశాడు..


అవినాష్ శర్మ అనే కాలేజ్ స్టూడెంట్ రంగోలి పై యాసిడ్ తో  దాడి చేశాడు. ఈ ఘటన జరిగిన సమయంలో రంగోలి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. ఆ వయస్సులోనే లవ్ ప్రపోజల్ ను తిరస్కరించినందుకు అవినాష్ ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. మరోవైపు ఈ విషయంపై స్పందిస్తూ కొన్ని విషయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తోంది..


అంతేకాకుండా కంగనారనౌత్ వ్యాఖ్యలకు ఆమె సోదరి రంగోలి నుంచి కూడా మంచి మద్దతు లభిస్తూ ఉండడం గమనార్హం.. వ్యవసాయ చట్టాలకు సంబంధించి కొన్ని రోజుల క్రితం వ్యవసాయం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా,  హృతిక్ రోషన్ తో డేటింగ్ చేయడం ద్వారా కూడా వార్తల్లో నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఇదిలా ఉండగా రంగోలి పై యాసిడ్ దాడి జరిగిన సమయంలో కంగనా కుటుంబం పేదరికంలో ఉండడంతో,  కంగనా కుటుంబం రంగోలి కి ఆపరేషన్ చేయించేలేకపోయారు. నటిగా ఎదిగిన తరువాత కంగనా దేశంలోని ప్రముఖ డాక్టర్లతో రంగోలి కి సర్జరీ చేయించడంతో  పూర్వపు రూపం వచ్చేందుకు చాలా కృషి చేశారు.. అయితే ఇప్పటికి రంగోలికి చికిత్స కొనసాగుతూనే ఉందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: