'ప్రస్థానం' సినిమా హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..??
ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది..ఇక సినిమా అనంతరం రూబీ.. తెలుగు, కన్నడ, హిందీ, తదితర భాషలలో దాదాపుగా 8కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.ఇందులో ప్రస్థానం, గబ్బర్ ఈస్ బ్యాక్ తదితర చిత్రాలు తప్ప మిగిలిన మూవీస్ అంతంత మాత్రమే. ఇక తెలుగులో హీరోయిన్ గా నటించిన చిత్రాల కథల విషయంలో అవగాహన లేకపోవడం కారణంగానే చాలా మూవీస్ డిజాస్టరయ్యాయి.కొన్ని మూవీస్ అయితే ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియదు.
ఇండస్ట్రీలో ఎలాగైనా పాగా వేయాలని కష్టపడినా ఛాన్స్ లు లేక, ముంబైకి చెక్కేసిన ఈమె బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "గబ్బర్ ఈస్ బ్యాక్" అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిసింది.దురదృష్టం కొద్దీ ఈ చిత్రం కూడా ఈ భామకు కలిసి రాకపోవడంతో ప్రస్తుతం మోడలింగ్ రంగంలో ఉందని టాక్. అయితే ఇటీవలే రూబీ పరిహార్ బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడిందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతు న్నట్లు వార్తలు వచ్చినా కూడా రూబీ పరిహార్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు..దీంతో ఈ వార్తలు నిజమేనని పలు మీడియా మాధ్యమాలు తెలిపాయి..!!