అలా చేసి 15 రోజులు కోమాలో ఉన్నా.. షాకింగ్ నిజం బయట పెట్టిన ముమైత్ ఖాన్..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ముమైత్ ఖాన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ముమైత్ ఖాన్. నడుమొంపు  అందాలతో తెలుగు ప్రేక్షకులందరి  మతి పోగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక అప్పట్లో ఏకంగా  స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు.  ఏదైనా సినిమాలో ఐటమ్ సాంగ్ లో ముమైత్ ఖాన్ చేస్తుంది అంటే  చాలు ఇక ప్రేక్షకులందరూ ఎగబడి మరీ సినిమా చూసే వాళ్ళు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేసింది ముమైత్ ఖాన్.

 ఇక ఎన్నో రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన ముమైత్ ఖాన్ ఆ తర్వాత మాత్రం ఇక అవకాశాలు తగ్గిపోవడంతో ఇక చిత్ర పరిశ్రమకు దూరం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పూర్తిగా వెండితెర పై కనుమరుగు అయ్యింది ఈ ముద్దుగుమ్మ. వెండితెర పై కనుమరుగు అయినప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం బుల్లితెరపై పలు కార్యక్రమాలలో కనబడుతూ అభిమానులను అలరిస్తోంది.  ఈ క్రమంలోనే ఇటీవలే ముమైత్ ఖాన్ ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.  సాధారణంగా ఈ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన వారు తమ పర్సనల్ లైఫ్ కి  సంబంధించి కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

 ఈ క్రమంలోనే ముమైత్ ఖాన్ ఎవరికీ తెలియని ఒక విషయాన్ని బయట పెట్టింది. ఓ సినిమా ఐటమ్ సాంగ్ కోసం చాలా బరువు తగ్గావట కదా.. ఇక అప్పుడు ఏకంగా కోమాలోకి వెళ్లిపోయావట అవునా అంటూ అలీ ముమైత్ ఖాన్ ను  ప్రశ్నిస్తాడు..  అవును అప్పుడు చాలా బరువు తగ్గాను..  అయితే ఇక ఐటమ్ సాంగ్ లో భాగంగా డాన్స్ చేస్తుంటే కాలు స్లిప్ కావడంతో ఇక గట్టిగా తల ఫ్లోర్ కి  తగిలింది అని.. దీంతో ఎక్కువ బ్లీడింగ్ కావడం తో ఏకంగా 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ముమైత్ ఖాన్. డాక్టర్లు 3 ఇయర్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినప్పటికీ తాను మాత్రం 3 మంత్స్ తర్వాత మళ్లీ వర్క్ స్టార్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఎవరికి తెలియని విషయం బయటపడడంతో అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: