చైతూ లవ్ స్టోరీ తో ఫ్యాన్స్ అంచనాలని అందుకుంటాడా?

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒత్తిడికి లోనయ్యి బాధ పడేవారు ఒక్కసారి ఆయన సినిమాలు చూస్తే చాలు దెబ్బకి రిలీఫ్ గా ఫీల్ అవుతారు. అంత కూల్ గా మంచిగా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు..ఇక లవర్ బాయ్ నాగ చైతన్య తో  వెండితెరపై "లవ్ స్టోరీ"తో మాయచేసేందుకు రెడీ అయిపోయాడు. ఈసినిమా ఏప్రిల్ 16వ తేదిన ప్రేక్షకుల ముందుకి సమ్మర్ కానుకగా తీస్కుని రాబోతున్నారు. దీనికి సంబంధించిన రిలీజ్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది మూవీటీమ్. మజిలీ, వెంకీమామ, సినిమాల తర్వాత నాగచైతన్య ఈసారి మరో హిట్ కొడతాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి మజిలీ సినిమాలో సమంత క్యారెక్టర్ హైప్ వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యిందని,అందుకే కలక్షన్స్ పరంగా సూపర్ సక్సెస్ అందుకుందని అన్నారు. అలాగే, వెంకీమామ కూడా మల్టీస్టారర్ సినిమా కాబట్టి అది కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యిందని చెప్పారు.
అందుకే, ఇప్పుడు సోలోగా నాగచైతన్య తన మార్కెట్ రేంజ్ ని పెంచుకునేందుకు  ఇది పర్ఫెక్ట్ సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మన టాలీవుడ్ లవర్ బాయ్  నాగచైతన్యతో హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవి కూడా ఆడియన్స్ ని ఫిదా చేయబోతోంది. తాము కన్న కలల్ని నిజం చేసుకునేందుకు హీరో హీరోయిన్స్ ఏం చేశారు అనేది కథాంశంగా ఉండబోతోందని చెప్తున్నారు. అయితే, క్లైమాక్స్ ట్రాజెడీగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. రీసంట్ గా రిలీజైనా టీజర్, సాంగ్స్ సినిమాపై యూత్ లో మంచి క్రేజ్ ని అంచనాలని పెంచుతున్నాయి.
చైతూ, సాయిపల్లవి జోడీకి ఆడియన్స్ తెగ ఫిదా అయిపోతున్నారు.అన్ని డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా సమ్మర్ లో ఏప్రిల్ 16న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ టైమ్ లో ఫీల్ గుడ్ మూవీలాగా కనిపిస్తున్న లవ్ స్టోరీ నాగచైతన్యకి మంచి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో సినిమా విషయాలు గురించి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: