కల్కి 2898AD: డైరెక్టర్ నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ తెలుసా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి కూడా ఈయనే దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మరొకసారి నాగ్ అశ్విన్ కు సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన లవ్ స్టోరీ గురించి కొన్ని విషయాలు వినిపిస్తున్న వాటి గురించి చూద్దాం.

కల్కి సినిమా వల్ల మళ్ళీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని ప్రభాస్ తెరకెక్కించారు. ఈ సినిమా బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ నటీనటులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో విడుదలైన అన్నిచోట్ల కూడా హిటీ టాక్ తో దూసుకుపోతోంది. వాస్తవానికి నాగ్ అశ్విన్ తల్లితండ్రులు ఇద్దరు కూడా వైద్యులే.. విరు రెడ్డి కులానికి చెందినవారు.. నాగ్ అశ్విన్ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ సైతం పూర్తి చేశారట. కెరియర్ మొదట్లో శేఖర్ కమ్ముల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు.

ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి విజయాన్ని అందుకున్నారు. ముందుగా సినిమాలలో కంటే పలు రకాల యాడ్సుల కోసం పనిచేశారు. ఆ సమయంలోనే ప్రముఖ నిర్మాత ప్రియాంక దత్తుతో నాగస్విని కి పరిచయం ఏర్పడిందట. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు డైరెక్టర్గా నాగ్ అశ్విన్ వ్యవహరించగా.. ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరించింది. ఆ సమయంలో వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నప్పటికీ.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో ప్రియాంక దత్ తన ఇంట్లో పెళ్లిచూపులు చూస్తున్నారని తెలిసి వెంటనే.. నాగ అశ్విన్ ప్రియాంకకు ప్రపోజ్ చేశారట.

ప్రియాంక దత్ ఇలా మాట్లాడుతూ.. మీకు ఎవరైనా నచ్చితే సరే లేకపోతే మనం వివాహం చేసుకుందామని చెప్పారట.. అందుకు ప్రియాంక కూడా ఓకే చెప్పడంతో 2015లో వీరు వివాహం జరిగింది. వీరి వివాహం పెద్దల సమక్షంలోనే జరిగినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇప్పుడు నాగ్ అశ్విన్ పేరే వినిపిస్తూ ఉన్నది కనుక ఈయన లవ్ విషయం కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: