డింపుల్ కష్టానికి ప్రతిఫలం దక్కింది.. 17 రోజుల్లోనే ఆ పని చేసి చూపెట్టిన బ్యూటీ..?

Pulgam Srinivas
ఇప్పటికే తెలుగు , తమిళ సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో హీరోయిన్గా అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె రవితేజ హీరోగా రూపొందిన కిలాడి , గోపీచంద్ హీరోగా రూపొందిన రామ లబాణం అనే రెండు తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించింది.
అలాగే తమిళ్ లో విశాల్ హీరోగా రూపొందిన సామాన్యుడు అనే సినిమాలో కూడా ఈమె హీరోనే నటించింది. ఈ మూడు మూవీలలో హీరోయిన్గా నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈమెకు పర్వాలేదు అనే స్థాయి ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ 17 రోజుల్లో 3 కిలోల బరువు తగ్గింది. ఇంత తక్కువ వ్యవధిలో అంత ఎక్కువ బరువు తగ్గడానికి ఈమె జిమ్ లో చాలా వర్కౌంట్ లు చేసింది. అందుకు సంబంధించిన ఒక పోస్టును కూడా ఈ బ్యూటీ షేర్ చేసింది.
తాజాగా ఈమె 17 రోజుల పాటు తీవ్రంగా కసరత్తు చేసి మూడు కేజీల బరువు తగ్గినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా పేర్కొంది. ఈ బ్యూటీ దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేసింది. దానికి గ్లిమ్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటూ కొటేషన్ కూడా జత చేసింది. అంతే కాకుండా తన ఫిట్నెస్ ట్రైలర్ తరుణ్ శోలా రాజన్ ను కూడా ఈమె తన ఫాలోవర్స్ కి , అలాగే తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. ఇక 17 రోజుల్లో మూడు కిలాల బరువు తగ్గడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. దానితో ఎంతో మంది ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: