అక్కడ జాన్వీ కపూర్ కి ఎదురుదెబ్బ.. ఇప్పటికి తెలుగు..హిందీ తోనే సరి పెట్టుకోవాల్సిందేనా..?

Pulgam Srinivas
శ్రీదేవి , బోని కపూర్ కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కుతున్న ఈమె దృష్టిని సౌత్ ఇండస్ట్రీ పై పెట్టింది.  అందులో భాగంగా ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల కాకముందే ఈ బ్యూటీ కి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఇలా తెలుగులో రెండు భారీ సినిమాలలో ఈ బ్యూటీ ఇప్పటికే హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇక జాన్వీ కొంత కాలం క్రితమే సూర్య హీరోగా కర్ణ అనే పేరుతో రూపొందబోయే పాన్ ఇండియా పౌరాణిక మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు వార్తలు వచ్చాయి.

రాకేష్ ఓం ప్రకాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రద్దు అయినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రద్దు కావడంతో జాన్వి ఎంట్రీ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఆల్మోస్ట్ క్యాన్సల్ అయింది. మరి ఈ ముద్దు గుమ్మ ఏ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: