ఆ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ "సత్యభామ"..!

Pulgam Srinivas
బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటిమని కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది . ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించ గా ... శ్రీ చరణ్ పాకాల ఈ మూవీ కి సంగీతం అందించగా , శశి కిరణ్ తిక్క , బాబి తిక్క ఈ మూవీ లను నిర్మించారు. 

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ డీసెంట్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా థియేటర్ లలో ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సినిమాను ఈ రోజు నుండి ఈ సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మూవీ కి ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: