ప్రభాస్ ఫస్ట్ మూవీ కోసం ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే..?

Suma Kallamadi
కల్కి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్. ఈ మూవీ గ్లోబల్ రేంజ్ లో సూపర్ హిట్ అయింది. భిన్నమైన కథ, హైటెక్ విజువల్స్ కారణంగా దీనిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక ట్రైనింగ్ టాపిక్ కూడా అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ హ్యాండ్సమ్ హీరో తొలి సినిమాకి తీసుకున్న పారితోషికం ఎంతో మనమూ తెలుసుకుందామా..
ప్రభాస్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా అతడి క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే అతని క్రేజీ పరిమితమైంది కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి మంచి హిట్టు అతడికి ఖాతాలో పడలేదు. హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నాడు. అనంతరం సలార్ తో మంచి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు కల్కితో మరో హిట్టు సాధించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ.600 కోట్ల బడ్జెట్‌తో కల్కి సినిమా తెరకెక్కింది.
ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న మరో 5 సినిమాలు కూడా వేలకోట్ల బడ్జెట్లతో తెరకెక్కుతున్నాయి. బడ్జెట్ కి తగినట్టే ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం, ప్రభాస్ సలార్ పార్ట్ 1 మూవీకి రూ.120 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోగా, కల్కి కోసం ఏకంగా రూ.150 కోట్లకు పైగా పుచ్చుకున్నాడు. ఒక తెలుగు హీరోకి ఈ స్థాయిలో ఒక్క సినిమాకి శాలరీ రావడం నిజంగా గర్వించదగిన విషయాన్ని చెప్పుకోవచ్చు.
ఇక అసలు విషయానికొస్తే ఈ మిర్చి హీరో "ఈశ్వర్ (2002) సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో శ్రీదేవి హీరోయిన్.  జయంత్ సి. పరాన్జీ దర్శకుడు. ఈశ్వర్, 2002 నవంబర్ 11న విడుదలై మంచి హిట్టు కొట్టింది. ప్రభాస్ హైట్, గ్లామర్ చూసి అమ్మాయిలు మనసు పారేసుకున్నారు. అయితే ఈ సినిమాకి ప్రభాస్ జస్ట్ 4 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నాడని తెలిసింది. వాస్తవానికి ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 22 ఏళ్ళల్లో 4 లక్షలు నుంచి 150 కోట్లు తీసుకునే వరకు ప్రభాస్ ఎదగడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ రేంజ్ అంతలా పెరిగిపోయింది కాబట్టే ఆయన శాలరీ కూడా పెరిగిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.బాహుబలి సినిమా దాకా ఈ హీరో రూ.25 కోట్లు మాత్రమే వసూలు చేశాడని ఆ తర్వాత 100 కోట్లకు చేరుకున్నాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: