మరోసారి డీసెంట్ టిఆర్పి రాబట్టిన హనుమాన్.. మనోడి ఊపు తగ్గేలా లేదుగా..!

lakhmi saranya
2024 లో చిన్న సినిమాగా విడుదల భారీ సంచలనం సృష్టించిన మూవీలలో హనుమాన్ మూవీ ముందు స్థానంలో నిలబడుతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ.. హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమాతో ప్రశాంత్ వర్మకి మంచి గుర్తింపు కూడా దక్కింది. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ప్రశాంత్ వర్మ కూడా ఒకటిగా పేరు సంపాదించుకున్నారు.
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ ఇటీవల రెండోసారి జీ తెలుగు ఛానల్లో ప్రచారం ఆయన సంగతి తెలిసిందే. మొదటిసారి ఈ మూవీ 11 టిఆర్పి రేటింగ్ను రాబడినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక రెండోసారి ఈ సినిమా డిఫరెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ రెండోసారి 5.37 టిఆర్పి రేటింగ్ను నమోదు చేసింది.
ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వినయ్ రాయ్, సముద్రఖని తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆ సీక్వెల్ కి జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. ఇక దీని సీక్వల్ కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని భార్య అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ మొదటి భాగం అంత పెద్ద హిట్ అయింది కనుక. హనుమాన్ మూవీ లో ప్రశాంత్ వర్మ రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను పిచ్చపిచ్చగా ఆకట్టుకున్నాయి. అందుచేత ఈ మూవీ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో త్వరలోనే తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: