టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్లోనే 30వ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తోన్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎన్టీఆర్ , త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ అవుతాడు.
అప్పుడెప్పుడో 2000లో నిన్ను చూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఏది బెస్ట్ అని ఓ ఆన్ లైన్ సర్వే జరగగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఓవరాల్‌గా సింహాద్రి సినిమాకు ఎక్కువ మంది ది బెస్ట్ మూవీ అని ఓట్లేశారు. ఇక స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు 3.05 % ఓట్లు పోలయ్యాయి. ఆదికి 15. 65 % ఓట్లు పోలయ్యాయి.
సింహాద్రి ఏ సినిమాకు అందనంత ఎత్తులో ఏకంగా 33. 25 % ఓట్లు సాధించింది. యమదొంగ 3.18 % ఓట్లను దక్కించుకుంది. ఇక అదుర్స్ 7. 85 % - టెంపర్ 14.79 % - నాన్నకు ప్రేమతో 7.41 % - జనతా గ్యారేజ్ 6.63 % - జై లవకుశ 2.61 % - అరవింద సమేత 5.58 % ఓట్లు పోలయ్యాయి. ఓవరాల్ గా సింహాద్రి సినిమా ఏకంగా 33 శాతం ఓట్లతో ఏ సినిమాకు అందనంత ఎత్తులో నిలిచింది. 2003లో వచ్చిన ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు.