అల్లు అర్జున్ పై మనసు పారేసుకున్న ప్రముఖ సింగర్.. ఎవరో తెలుసా..??
ప్రముఖ యువ గాయని కం పాటల రచయిత ఆస్తా గిల్ ఇప్పుడు బన్ని అభిమానుల జాబితాలో చేరింది. `అల వైకుంఠపురములో` స్టార్ బన్నీకి పెద్ద అభిమాని అని ఆస్తా స్వయంగా పేర్కొన్నారు.``నేను అల్లు అర్జున్ నటించే సినిమాకి పాడాలని ఆశిస్తున్నాను. తద్వారా అతను నా సంగీతానికి అలవాటు పడతారు`` అని ఆస్తా ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఇంటర్వ్యూలో అన్నారు.నా కల నిజమవుతుందని ఆశిస్తున్నానని అన్నారు ఆస్తా. సదరు పంజాబీ గాయని తెలుగు సినిమాల్లో పాడటానికి ఇష్టపడుతుందని.. భాష తెలియకపోయినా ఆసక్తిగా ఉందని దీనిని బట్టి అర్థమవుతోంది.ఆస్తా ప్రముఖ పంజాబీ కళాకారులు దిల్జిత్ దోసంజ్... బాద్షాలతో కలిసి పనిచేశారు. బాలీవుడ్ సినిమాల్లో అనేక పాటలు పాడారు.
ప్రస్తుతం సౌత్ పై దృష్టి సారించిన ఈ హాట్ సింగర్ తెలుగులో బన్నీ సినిమాకి పాడాలని భావిస్తున్నారు. మరి బన్ని తన పిలుపు విని స్పందిస్తారా లేదా? ఫ్యూచర్ లో బన్నీ నటించే మూవీస్ లో ఈ సింగర్ కి పాట పాడే అవకాశం ఇస్తాడేమో చూడాలి.. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బన్నీకీ జోడిగా రష్మీక మందన్న కథానాయికగా నటిస్తోంది..వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్...!!