ఇది మీకు తెలుసా.. 'ఆచార్య' లో చిరంజీవి ఆ పాత్రలో కనిపించేది పది నిమిషాలేనట..?
ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమాలో మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కనిపిస్తారు. అయితే ఆచార్య సినిమాలో ఎండోమెంట్స్ అధికారి పాత్ర కు సంబంధించి ఆసక్తికర టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కేవలం పది నిమిషాలు మాత్రమే కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సీన్లలో మాత్రమే అలా కనిపిస్తారట చిరంజీవి. ఇక ఈ పాత్రకు సంబంధించిన సీన్స్ ని ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే మాత్రం చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ రెండవసారి నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ పాత్రలో నటిస్తూ ఉండడం మరిన్ని అంచనాలను పెంచుతుంది.