ప్రభాస్ సినిమా ఇష్యూలో నచ్చని విషయం..!
కరోనా సమయంలో సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. ఇక రిలీజ్ డేట్ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చుకుంది. ఆల్ రెడీ షూటింగ్ స్టార్ట్ చేసి.. ఫిబ్రవరినాటికి పూర్తిచేసేస్తారట. షూటింగ్ ఇంత పకడ్బందీగా జరుగుతున్నా.. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడానికి రాజమౌళి భయపడుతున్నాడు. ఇప్పటికే రెండుసార్లు పోస్ట్‌పోన్ కాగా.. మళ్లీ వాయిదా పడితే.. అభాసుపాలవుతామన్న ఫీలింగ్ జక్కన్నది. రాజమౌళీదే కాదు.. కరోనా వేళా అందరూ ఇదే ఫీలింగ్‌లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకున్న పరిస్థితుల్లో ఆదిపురుష్ సెట్స్‌పైకి రాకుండానే.. రిలీజ్ డేట్‌తో వచ్చేసింది.
రాధా శ్యామ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ వచ్చీరావడంతో... ముంబాయ్ వెళ్లి ఆదిపురుష్ చర్చల్లో పాల్గొన్నాడు. ఈక్రమంలో షూటింగ్ షెడ్యూల్స్.. టెస్ట్ కట్‌తోపాటు.. రిలీజ్ డేట్ కూడా ఫైనల్ చేసేశారు. రాధాశ్యామ్ తర్వాత ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్‌లో నటించాల్సి వుంది. అయితే.. ఆ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇంకా పూర్తికాకపోవడంతో.. ఆదిపురుష్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. సీత పాత్ర ఇంకా ఫైనల్ కాకపోవడంతో.. రిలీజ్ డేట్ పోస్టర్‌పై ప్రభాస్, సైఫ్ పేర్లు మాత్రమే వేశారు. మరి ఈ రాముడికి తగ్గ సీత ఎక్కడ వుందోగానీ.. ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు దర్శకుడు.
ఆదిపురుష్ రిలీజ్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నచ్చలేదు. ఎందుకంటే... వీళ్లు సెంటిమెంట్‌గా ఆలోచిస్తున్నారు. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ మార్చుకుంటూ వచ్చిన సాహో.. ఎట్టకేలకు 2019 ఆగస్ట్ 15న రావాల్సి వుంది. మరోసారి వాయిదాపడి ఆగస్ట్ 30న రిలీజ్ అయింది. ప్రభాస్ కెరీర్ మొత్తం మీద ఆగస్ట్‌లో రిలీజైన ఏకైక సినిమా సాహో. సినిమా ఫ్లాప్ కావడంతో.. సెంటిమెంట్ రీత్యా.. ఆదిపురుష్ కూడా ఆగస్ట్‌లో రావడంతో భయపడుతున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మన్నించి విడుదల తేదీ మారుస్తారా? లేదంటే.. ప్రభాస్‌కు ఆగస్ట్ కూడా కలిసొస్తుందని ఆదిపురుష్‌తో నిర్మాతలు నిరూపిస్తారో చూడాలి.