ఆ పరిస్థితి వస్తే అప్పుడు అన్నయ్య సలహా అడుగుతా : ఆనంద్ దేవరకొండ
అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్నైట్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోయాడు. మరోవైపు తన ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది యువతకు ఐకాన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. దొరసాని అనే మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.
తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి మాట్లాడిన ఆనంద్ దేవరకొండ తన సినిమాల ఎంపికలో అన్నయ్య ప్రమేయం ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక ప్రేక్షకుడిగా తనకు నచ్చే కథలనే ఎంచుకుంటానని.. అన్నయ్య కి స్టార్ డమ్ కీ తగ్గట్లుగా తాను సినిమాలు చేయడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పెద్ద సినిమాలు వస్తే అప్పుడు అన్నయ్య సలహా అడుగుతాను అంటూ చెప్పుకొచ్చారు ఆనంద్ దేవరకొండ.