నిధి అగర్వాల్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. ఆ ఫోటోనే కారణమా?
'బాత్రూంలో సెల్ఫీ దిగి సోషల్ మీడియా వేదికగా పెట్టడం సరైనదేనా? ఇది ఒక పబ్లిక్ వల్గర్ స్టంట్ తప్ప మరేమి కాదు' అని ఓ నెటిజెన్ నిధి అగర్వాల్ ని తిట్టిపోశారు. మరికొందరు కూడా ఈ ఫోటో బాగోలేదు అని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ ఫోటోలో వల్గర్ గా కనిపించేంతగా అశ్లిలత ఏమీ లేదని కొందరు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇది ఒక గ్లామర్ ఫోటో. ఇందులో పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేదని మరికొందరు అంటున్నారు.
22 గంటల క్రితం అప్లోడ్ చేయబడిన ఈ ఫోటోకి ఇప్పటికే ఆరు లక్షల లైకులు వచ్చాయి. కాకపోతే గతంలో చైనా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ భారతీయల ఆగ్రహానికి కారణం అయ్యారు.
ఇదిలా ఉండగా.. గత ఆరు నెలల నుండి నిధి అగర్వాల్ తమిళ భాష నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్స్ లో పాల్గొంటున్నారు. తమిళ భాషపై పట్టు సాధించి తమిళ సినిమాలో అద్భుతంగా నటించాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె హీరో శింబు సినిమాలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.