ఆ విషయంలో చిరూ, చరణ్ లు ఇద్దరూ నాకు సమానమే : శ్రీకాంత్

Anilkumar
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ కి మంచి క్రేజ్ ఉండేది. తన కెరియర్ లో ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీస్ చేసాడు ఈ హీరో. ముఖ్యంగా  'పెళ్లి సందడి' రోజుల్లో అతడికి మంచి క్రేజ్ ఉండేది. డిమాండ్ పడిపోయాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. తను హీరోగా చేస్తున్న రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవితో 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌', 'శంకర్‌దాదా జిందాబాద్' సినిమాల్లో ఏటీఎమ్‌గా కీలక పాత్ర చేశాడు. కోరి మరీ ఆ సినిమాల్లో ఆ క్యారెక్టర్ చేశాడు శ్రీకాంత్‌. ఆ తర్వాత చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌తోనూ ఓ సినిమా చేశాడు.. అది.. కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన 'గోవిందుడు అందరి వాడేలే'. ఆ మూవీలో చరణ్‌కు బాబాయ్‌గా బంగారి అనే క్యారెక్టర్ చేశాడు.ఒక విషయంలో తండ్రీకొడుకులిద్దరూ సేమ్ టు సేమ్ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శ్రీకాంత్‌.
"చిరంజీవి ఎంత బాగా టైమింగ్ మెయిన్‌టైన్ చేస్తారో నాకు బాగా తెలుసు. పొద్దున్నే ఏడు గంటలకంటే ఏడు గంటలకు ఆయన సెట్స్ మీదుంటారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామంది మెల్లిగా వెళ్దాంలే అనుకుంటూ ఉంటారు. కానీ రామ్‌చరణ్ కూడా అచ్చం చిరంజీవిగారి లాగే ఏడు గంటలకు సీన్ తీయాలంటేఏ ఆ టైమ్‌కు సెట్‌లో ఉంటాడు. ఆ అంకితభావం అతనిలో ఉంది. అలాగే సబ్జెక్ట్ మీద ఎంతో ఇన్‌వాల్వ్‌మెంట్ చూపిస్తాడు. ఆ విషయంలో ఇద్దరూ ఒకే రకంగా అనిపించారు" అని చెప్పాడు శ్రీకాంత్‌.ఇక ఇటీవల శ్రీకాంత్ నటించిన సినిమాలన్నీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయాయి.
అందుకే ఇప్పుడు అటు హీరోగా, ఇటు అగ్ర హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రల్లో కూడ నటిస్తున్నాడు. ఇక నెగిటివ్ రోల్స్ కూడ శ్రీకాంత్ నటించడానికి మొగ్గుచూపుతున్నాడట. ఈ మధ్యే బాలయ్య, బోయపాటి మూవీలో శ్రీకాంత్ ని ఓ నెగిటివ్ రోల్ కోసం అడిగారని తెలుస్తోంది. ఇదిలా ఉంటె శ్రీకాంత్ నటించిన 'పెళ్లిసందడి'రీమేక్ లో ఆయన తనయుడు రోషన్ నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్నీ స్వయంగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తెలపడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: