ఆర్ ఆర్ ఆర్ మీద ట్రోల్ల్స్... ఆ చిన్న లాజిక్ మిస్ అయినందువల్లనే అట...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... బాహుబలి తో ఇండియా మొత్తం పాపులర్ అయ్యాడు రాజమౌళి. ఆ సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఇక విషయానికి వస్తే... అక్టోబర్ 22న తెలంగాణ తొలి గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమరం భీం జయంతి. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’లో భీం పాత్రలో యాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు. టీజర్ కోసం అవసరమైన షాట్స్ తియ్యడానికి సోమవారం షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ రెండు విషయాలు చెప్పడానికి మంగళవారం ఒక వీడియో విడుదల చేశారు. రాజమౌళి మీద ట్రోల్స్ రావడానికి కారణమయ్యింది.

టీజర్ లో 1.18 మినిట్స్ దగ్గర రాయల్ ఎన్ ఫీల్డ్ రైజ్ చేస్తున్న షాట్ చూపించారు. రాజమౌళిని ట్రోల్ చెయ్యడానికి రీజన్ అదే. స్వాతంత్య్రం రావడానికి ముందు కాలం నాటి కథతో ‘ఆర్ఆర్ఆర్’ను తీస్తున్నారు. అప్పట్లో సెల్ఫ్ స్టార్ బైక్స్ ఎక్కడ వున్నాయని ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు. ఇదీ లాజిక్కే. ఆ చిన్న లాజిక్ రాజమౌళి ఎలా మిస్ అయ్యారో మరి? రాజమౌళికి ట్రోల్స్ పేస్ చెయ్యడం కొత్త కాదు. ‘మగధీర’ టైమ్ నుండి ఆయన మీద విమర్శలు వస్తున్నాయి.

విమర్శలను పక్కన పెడితే ఆయన సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మీద నేషనల్ వైడ్ లో భారీ అంచనాలు వున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని వుహించవచ్చు...

ఇక ఆర్.ఆర్.ఆర్ తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం చాలా మంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే వున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: