ఏం చూసుకొని ఆయనకు అంత నమ్మకం..!

NAGARJUNA NAKKA
త్రివిక్రమ్‌ హీరో హీరోయిన్ల ఇమేజ్‌ను వాడుకుంటూ..తన మాటలను అమ్ముకుంటూ.. హిట్స్‌ కొడతాడని  అందరూ అనుకుంటారు. కానీ.. స్టార్‌డమ్‌... పంచ్‌ డైలాగ్స్‌ కంటే.. మరో  విషయాన్ని బలంగా నమ్ముతాడు.

అత్తారింటికి దారేది నుంచి అల వైకుంఠపురంలో వరకు త్రివిక్రమ్‌ సినిమాలో హీరోహీరోయిన్స్‌ రోల్స్‌ కంటే.. సపోర్టింగ్స్‌ రోల్స్‌కే బలం ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే.. కథ మొత్తాన్ని వాళ్లే నడిపించారు. అత్తారింటికి దారేదిలో నదియా పోషించిన సపోర్టింగ్‌ రోల్‌ ఆమె కెరీర్‌లో టాప్‌గా నిలిచింది. కథ డిమాండ్‌ చేయడంతో.. టైటిల్‌ కూడా ఆమె పాత్ర  కలిసొచ్చేలా పెట్టాడు త్రివిక్రమ్‌. ఆ తర్వాత త్రివిక్రమ్‌ తీసిన అఆ లో కూడా నదియాది ఇంపార్టెంట్‌ రోలే.

త్రివిక్రమ్‌ సినిమా తీస్తున్నాడంటే.. లేడీ సపోర్టింగ్‌ యాక్ట్రర్స్‌ పంట పండినట్టే. పవన్‌కల్యాణ్‌తో తీసినా.. నితిన్‌తో సినిమా.. చిన్నా పెద్ద హీరో అన్న తేడా ఉండదు. సహాయక నటి చుట్టూ కథ తిరుగుతుంది. అజ్ఞాతవాసి నిరాశపరిచినా.. వెయిట్‌ ఉన్న రోల్‌ పోషించింది ఖుష్బూ. ఇక అలవైకుంఠపరంలో సక్సెస్‌ క్రెడిట్‌ తమన్‌కు అందరూ ఇచ్చేసినా.. ఈశ్వరీ రావు పోషించిన పాత్రే కథను మలుపు తిప్పింది.

తమిళనాడు సెటిలైన తెలుగునటి ఈశ్వరీరావుకు త్రివిక్రమ్‌  ప్రాధాన్యమున్న పాత్రలు ఇస్తున్నాడు. అరవింద సమేత వీర రాఘవ క్లైమాక్స్‌ లో భారీ యాక్షన్‌ లేకుండా.. మలుపు తిప్పిన పాత్రలో కనిపించింది ఈశ్వరీ రావు.

అల వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌తో సినిమా కమిట్‌ అయ్యాడు. 'అయినను  పోయిరావలె హస్తినకు' అన్న టైటిల్‌ ప్రచారంలో నడుస్తోంది. త్రివిక్రమ్‌ రాసుకున్న కథలో సపోర్టింగ్‌ రోల్‌కు చాలా ఇంపార్టెన్స్‌ వుందట. నదియా, ఈశ్వరీరావుకు చెరో రెండుసార్లు ఛాన్స్‌ ఇచ్చిన దర్శకుడు ఈసారి వేరే ఆర్టిస్ట్‌కు ఛాన్స్ ఇచ్చే పనిలో ఉన్నాడట. పరిశీలనలో రమ్యకృష్ణ పేరు వినిపిస్తోంది. రమ్యకృష్ణను డైరెక్టర్‌ చేయడం త్రివిక్రమ్‌కు ఇదే ఫస్ట్ టైం అయినా.. ఎన్టీఆర్‌ రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రెండు సినిమాలొచ్చాయి. సింహాద్రిలో ఐటంసాంగ్‌ చేసిన రమ్యకృష్ణ.. నాఅల్లుడుతో తారక్‌కు అత్తగా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: