వెబ్ సిరీస్ లోకి అడుగు పెడుతున్న ఎన్టీఆర్ దర్శకుడు
ఇదిలా ఉంటె ఇప్పుడు కొరటాల శివ ఓటీటీ రంగం లో అడుగు పెట్టబోతున్నాడని తాజా గా ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వస్తున్నాయి.ఓటీటీ లో తాజాగా కొరటాల శివ కూడా ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. తన అసిస్టెంట్ కిరణ్ అనే నూతన దర్శకుడు అవకాశం ఇస్తూ వెబ్ సిరీస్ ను నిర్మించాలని ఆలోచనలో ఉన్నాడు. ఈ సిరీస్ కి కొరటాల శివ స్క్రిప్టును ఇస్తున్నారట. సినిమా ఇండస్ట్రీ లో ఉండే కష్టాలు మోసాలతో పాటు సినిమాపై ఉన్న ప్రేమ నిజాయితీ గా ఎలివేట్ చేస్తూ అలాగే లైఫ్ ఎలా ఉంది అనే పాయింట్ కూడా ఈ వెబ్ సిరీస్ లో ప్రధానంగా ఉంటుందట.
ఇక ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇప్పటికే చిరు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది.2021 వేసవి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా లో రాం చరణ్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.